చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు: హరీష్ రావు
హైదరాబాద్: గతంలో సీఎంలు అంతా హైదరాబాద్ లో ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రజల మధ్యనే ఉంటున్నారని ఆ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ...ప్రజల సంక్షేమానికి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోకుండా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. విభజన సిద్థాంతాన్ని చంద్రబాబు గౌరవించడం లేదని హరీష్ రావు మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో ఎరుకలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కేసీఆర్ త్వరలో కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పర్యటిస్తారని ఆయన వెల్లడించారు.