harish ro
-
కాంగ్రెస్, బీజేపీ నాయకులపై హరీష్ రావు ధ్వజం
సాక్షి, సిద్దిపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ముందు మాత్రమే కనిపిస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. బుధవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రజలారా మీరు పదిహేను రోజులు మీరు కష్టపడి పని చేయండి తర్వాత ఐదు ఏళ్లు మేము మీకు సేవ చేసి చూపిస్తామన్నారు. ఎన్నికలు వస్తుండటంతోనే కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నేతలు ప్రజల ముందుకు వస్తారు... తర్వాత వాళ్ల అడ్రాస్ కూడా దొరకదన్నారు. రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద భరోసా లేదు, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం లేదు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే బీజేపీ ఇవ్వడం లేదని ఆరోపీంచారు. బీజేపీలో ఉన్న దత్తాత్రేయను ఊడగొట్టి, తెలంగాణకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీకి ఓటేస్తే మోదీకి లాభం, కాంగ్రెస్‌కు పార్టీకి ఓటేస్తే రాహుల్‌కు లాభం. కానీ మన టీఆర్ఎస్కు ఓటేస్తే తెలంగాణకు లాభం జరుగుతుందన్నారు. -
సర్దు‘బాట’లో..
తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్ల కేటాయింపు జరిగి నెల రోజులు కావస్తున్నా పార్టీలో అంతర్గతంగా తలెత్తిన అసమ్మతి కొలిక్కి రావడం లేదు. ఇతర పార్టీల నుంచి రాజకీయ వలసలు కూడా ఆశించిన రీతిలో జరగడం లేదు. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు, క్రియాశీల నాయకులు పార్టీని వీడుతున్నారు. సొంత గూటిలో అసమ్మతిని సర్దుబాటు చేసే బాధ్యతను పార్టీ అభ్యర్థులకు అప్పగించినా ఫలితం కనిపించడం లేదు. దీంతో అప్రమత్తమైన పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో అసమ్మతి సెగను ఆర్పే బాధ్యతను ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో టీఆర్ఎస్లో అంతర్గత అసమ్మతితో పాటు రాజకీయ వలసలు ఆందోళన కలిగిస్తున్నాయి. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్య నేతలు నలుగురు ఒకే రోజు కాంగ్రెస్ గూటికి చేరడం చర్చనీయాంశమైంది. అందోలులో టికెట్ దక్కని తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ బీజేపీలో చేరారు. సంగారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎంపీపీ రాజేశ్వర్ రావు దేశ్‌పాండే బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో గ్రామస్థాయి నాయకులు కాంగ్రెస్‌లో చేరినా, మరుసటి రోజే టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. నర్సాపూర్, సంగారెడ్డి, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు పార్టీ అభ్యర్థుల వెంట ప్రచార పర్వంలో కనిపించడం లేదు. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఖరారు కాకపోవడంతో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం పట్టాలెక్కలేదు. మరోవైపు గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాణిక్‌రావుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అవకాశం ఇవ్వకూడదంటూ కొందరు నేతలు తెగేసి చెబుతున్నారు. అసెంబ్లీ రద్దు ప్రకటన రోజే పార్టీ అభ్యర్థులను ప్రకటించినా, నెల రోజులుగా పార్టీలో నెలకొన్న అసమ్మతి సర్దుబాటు కావడం లేదు. అసమ్మతి నేతలతో మంతనాలు జరిపి సర్దుబాటు చేసుకోవాల్సిందిగా పార్టీ అభ్యర్థులకు సూచించింది. అభ్యర్థులతో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ పలు దఫాలుగా భేటీ జరిపి సూచనలు చేసినా క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితం కనిపించడం లేదు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా అసమ్మతి సర్దుబాటు కాకపోవడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. రంగంలోకి మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని ప్రత్యేక బృందాలు, సర్వే టీంలతో పార్టీ ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ప్రత్యేక బృందాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అసమ్మతిని సర్దుబాటు చేసే బాద్యతను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. నర్సాపూర్‌లో జెడ్పీ చైర్మన్ రాజమణి మురళీయాదవ్, జెడ్పీటీసీ సభ్యులు కమలాబాయి, జయశ్రీ, ఇతర అసంతృప్త నేతలతో మంత్రి మాట్లాడారు. పార్టీ అభ్యర్థి మదన్ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొనేలా సయోధ్య కుదిర్చారు. సంగారెడ్డి నియోజకవర్గంలో జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్‌తోనూ మంతనాలు జరిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రచారానికి దూరంగా ఉంటున్న నేతలతో మరోమారు సమావేశం కావాలని మంత్రి నిర్ణయించారు. సిద్దిపేట, గజ్వేల్, మెదక్, దుబ్బాక నియోజకవర్గాల్లో పెద్దగా అసమ్మతి బెడద లేకున్నా, స్థానికంగా సమన్వయం ఉండేలా చూసుకోవాలని మంత్రి హరీశ్‌రావు పార్టీ నేతలకు జాగ్రత్తలు చెబుతున్నారు. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఖరారు కాకపోవడంతో అసమ్మతి గళం వినిపించడం లేదు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాణిక్‌రావుకు మరోమారు అవకాశం ఇవ్వొద్దంటూ స్థానిక నేతలు హరీశ్ వద్దకు బారులు తీరుతున్నారు. దీంతో మాణిక్‌రావు, నరోత్తమ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. చేరికలపై ప్రత్యేక వ్యూహం ఓ వైపు పార్టీలో నెలకొన్న అసమ్మతిని సర్దుబాటు చేస్తూనే, ఎదుటి పార్టీల నుంచి ముఖ్య నేతలను టీఆర్ఎస్ గూటికి చేర్చేందుకు హరీశ్ వ్యూహ రచన చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకునే దిశగా చర్చలు సాగుతున్నాయి. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ముఖ్యులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్‌లోనూ ఇద్దరు ముఖ్య నేతలతో చర్చలు సఫలం అయితే, ఓ ప్రధాన సామాజిక వర్గం ఓటర్లు పార్టీ వైపు మొగ్గు చూపుతారనే అంచనాతో హరీశ్ ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు తర్వాత తలెత్తే పరిణామాలను విశ్లేషించుకుంటూ, చేరికల వ్యూహాన్ని అమలు చేయాలనే ఆలోచనలో మంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. ‘మన ప్రచారాన్ని చురుగ్గా సాగిస్తూనే, ఎదుటి పార్టీ కదలికలపైనా కన్నేయాలని’ పార్టీ అభ్యర్థులకు హరీశ్‌రావు సూచనలు చేస్తున్నట్లు సమాచారం. -
అందుబాటులోకి ‘వెల్నెస్’
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులు, జర్నలిస్టులకు ఉచితంగా వైద్య ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బురుజు దగ్గర్లో గల పాత మాతా శిశుసంరక్షణ (ఎంసీహెచ్) సేవలు అందించే భవనంలో వెల్నెస్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని శనివారం (నేడు) జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించనున్నారని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే విషయాన్ని ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావ్ వారం రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని ఏంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై త్వరలోనే వెల్నెస్ సేవలు అందుబాటులోకి వస్తాయని గుర్తు చేసిన విషయం విదితమే. సిద్దిపేటకమాన్ (సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులను జారీ చేసింది. ఈ ఆరోగ్య కార్డులున్న వారితోపాటు వారి కుటుంబానికి అవసరమైన వైద్యసేవలు ఉచితంగా అందిస్తుంది. ఒక కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచితంగా సేవలందిస్తారు. పరిమితి దాటితే ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఆరోగ్య కార్డులు ఉన్న వారు వైద్య సేవల నిమిత్తం హైదరాబాద్ ప్రాంతానికి వెళ్లి రావాల్సి వచ్చేది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుతో వీరికి ఇబ్బందులు తప్పనున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఐదు ప్రైవేటు ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య కార్డులున్న వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. ఏడాది కిందటే మంజూరు సంవత్సరం కిందటే సిద్దిపేటకు వెల్నెస్ సెంటర్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. సిద్దిపేటకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు కావడం, జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా నూతనంగా 300 పడకల ఆస్పత్రిని నిర్మించడంతో సిద్దిపేటలోని ఏంసీహెచ్ విభాగాన్ని నూతన జిల్లా ఆస్పత్రి భవనంలోకి తరలించడం జరిగింది. దీంతో పాత ఎంసీహెచ్ భవనం ఖాళీ అయ్యింది. దీంతో పాత ఎంసీహెచ్ భవనంలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పుర్తి చేశారు. సుమారు రూ. పది లక్షల వ్యయంతో అన్ని వసతులను ఏర్పాటు చేసి సెంటర్ ప్రారంభానికి సిద్ధం చేశారు. వెల్నెస్ సెంటర్లో ఓపీ సేవలతో పాటు, జనరల్ సర్జరీ, ఆప్థాల్మిక్ సేవలు, దంత వైద్యం, గైనకాలజీ సేవలు అందించనున్నారు. ఇక్కడ వైద్య సేవలకు అవసరమైన యంత్ర పరికరాలు, మందులు, సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని వసతుల ఏర్పాటు.. వెల్నెస్ కేంద్రంలోని భవనంలో ఓపీ సేవల కోసం గదులు, ఈసీజీ, ఎక్స్‌రే, దంత పరీక్షలు, డయాగ్నస్టిక్ పరీక్షల కోసం గదులను ఏర్పాటు చేశారు. ఇందుకు కావాల్సిన యంత్ర పరికరాలు, ఫర్నీచర్, సిబ్బందిని సిద్దం చేశారు. కార్పొరేటు ఆస్పత్రులకు దీటుగా ఇక్కడ వైద్య సేవలు అందనున్నాయి. ఇప్పటికే ఒక వైద్యుడితో పాటు సెంటర్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. వెల్నెస్ సెంటర్‌ను శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అమర్‌సింగ్ నాయక్, వెల్నెస్ సెంటర్ సిబ్బంది పాల్గొంటారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. జర్నలిస్టులు, ఉద్యోగుల సంక్షేమం కోసం.. జిల్లాలోని జర్నలిస్టులు ప్రతి నిత్యం పని ఒత్తిడితో సతమతం అవుతూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. వారి సంక్షేమం కోసం జిల్లాలోని జర్నలిస్టులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా వైద్య చికిత్సలు అందిస్తూ, ఉచితంగా మందులను అందివ్వడానికి దోహదపడుతుంది. జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ అందుబాటులోకి రావడం సంతోషించదగ్గ విషయం. ఈ వెల్నెస్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావ్ -
పనులు ఉరకలెత్తాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టు పనులను ఉరకలెత్తించి నిర్దిష్ట కాలంలో సంబంధిత ఆయకట్టుకు నీరందేలా చూడా లని అధికారులను నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులు, భూసేకరణ, పునరావాసం పనుల తీరును మంత్రి వీడియో సమావేశం ద్వారా గురువారం సమీక్షించారు.. మిడ్ మానేరు , ఛనాకా– కొరటా బ్యారేజి, కొమురంభీం ప్రాజెక్టు, గొల్ల వాగు, ర్యాలీ వాగు, నీలవాయి ప్రాజెక్టు, జగన్నాథపూర్, మత్తడి వాగు, సాత్నాల, స్వర్ణ, గడ్డన్న వాగు, ఎన్టీఆర్ సాగర్, వట్టి వాగు, పీపీ రావు, ప్రాజెక్టుల తీరును తెలుసుకొని హరీశ్ అధికారులకు సూచనలు చేశారు. అక్టోబరు నాటికి ఛనాకా–కొరటా నీరు ఛనాకా– కొరటా ప్రాజెక్టులో ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ నాటికి నీరు నింపి 13 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించేలా చేయాలని మంత్రి ఆదేశించారు. కొమురంభీం ప్రాజెక్టు కింద గత ఏడాది 20 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వగా, ఈ ఏడాది కనీసం అదనంగా మరో 5 వేల ఎకరాలకు ఇవ్వాలని, రైల్వే క్రాసింగ్ పనులను పూర్తి చేసి మరో 15 వేల ఎకరాలకు అందించాలన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఇంకా 280 ఎకరాల భూసేకరణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌ను ఆదేశించారు. దీనికి రూ. పది కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. గొల్లవాగు ప్రాజెక్టులో ఫీల్డ్ ,చానల్స్, మిగిలిన చిన్న చిన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. నీలవాయి ప్రాజెక్టు లో 8 వేల ఎకరాలకు నీరు ఇచ్చేలా ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. జన్నాథపూర్ ప్రాజెక్టు బ్యారేజీ పనులు పూర్తయ్యయాని చెప్పారు. ఎన్టీ ఆర్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది అదనంగా మరో 3 వేల ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. వట్టి వాగు ద్వారా ఈ ఏడాది 16 వేల ఎకరాలకు నీరు ఇచ్చేలా చూడాలన్నారు. దీని ఆధునీకరణకు రూ.26 కోట్లకు ప్రతిపాదనలు పంపాలని ఇంజనీర్లను ఆదేశించారు. డీపీ రావు ప్రాజెక్టు ఈ ఏడాది అదనంగా మరో 3,500 ఎకరాలకు నీరిస్తామని మంత్రి చెప్పారు. మత్తడి వాగు ప్రాజెక్టు ద్వారా 1200 ఎకరాలకు నీరిచ్చే పనులపై కలెక్టర్ సమీక్ష జరిపి ఈ ఖరీఫ్‌కు పైలట్ ప్రాజెక్టును విజయవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ దివ్యను కోరారు. లోయర్ పెన్ గంగకు గాను జూలై చివరికల్లా భూసేకరణ చేపట్టాలన్నారు. సాత్నాల ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది 6 వేల ఎకరాలకు నీరు ఇవ్వాలని ఆదేశించారు. గడ్డన్న వాగు ద్వారా 12వేల ఎకరాలకు నీరిస్తామని, మిగిలిన మరో 2 వేల ఎకరాలకు కాలువల ఆధునీకరణ ద్వారా నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిడ్ మానేరు ద్వారా 76 వేల ఎకరాలకు నీరు మిడ్ మానేరు కింద 76వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ప్యాకేజీల వారీగా పనుల తీరును కాంట్రాక్టర్లతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. మిడ్ మానేరు పునరావాస చర్యల కోసం రూ.33 కోట్లకు అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. ఆర్థికశాఖతో మాట్లాడి ఈ ప్రక్రియను హరీశ్ వెంటనే పూర్తిచేయించారు. ఈ సమీక్షలో మంత్రి జోగు రామన్న, సాగు నీటి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఈఎన్సీలు హరిరామ్, అనిల్ కుమార్, సీఈలు భగవంతరావు, శంకర్, వెంకటేశ్వర్లు ( క్వాలిటీ కంట్రోల్ ), సంబంధిత జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. -
సంగీతకు మంత్రి సన్మానం
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన అర్బన్ ప్లానర్ పుల్లూరి సంగీతను మంత్రి హరీశ్‌రావు ఘనంగా సన్మానించారు. పుల్లూరి సంగీత 11 స్మార్ట్ సిటీలకు అర్బన్ ప్లానర్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇటీవల ఇండియాలో మొదటి ఉత్తమ మున్సిపాలిటీగా సిద్ధిపేటను తీర్చిదిద్దటం, స్వచ్ఛభారత్ తోపాటు, ఐఎస్ఓ గుర్తింపు తేవడం కోసం సంగీత పాటుపడ్డారని తెలిపారు. ఇందుకు శనివారం రాత్రి సిద్ధిపేటలోని కొమటిచెర్వు కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ స్థాయి స్వచ్ఛత ఎక్సెలెన్స్ ఆవార్డు–2018లో భాగంగా అవార్డులు, సన్మాన కార్యక్రమం నిర్వహంచారు. కాగా మంత్రి హరీశ్‌రావు పుల్లూరి సంగీతను శాలువా, గుర్తింపు జ్ఞాపికతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజాపేటకు చెందిన పుల్లూరి వెంకటేశం కుమార్తె పుల్లూరి సంగీతకు పలువురు నాయకులు, వ్యాపారవేత్తలు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. -
చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు: హరీష్ రావు
హైదరాబాద్: గతంలో సీఎంలు అంతా హైదరాబాద్ లో ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రజల మధ్యనే ఉంటున్నారని ఆ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ...ప్రజల సంక్షేమానికి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోకుండా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. విభజన సిద్థాంతాన్ని చంద్రబాబు గౌరవించడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో ఎరుకలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కేసీఆర్ త్వరలో కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పర్యటిస్తారని ఆయన వెల్లడించారు.