సాక్షి, సిద్దిపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ముందు మాత్రమే కనిపిస్తారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. బుధవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రజలారా మీరు పదిహేను రోజులు మీరు కష్టపడి పని చేయండి తర్వాత ఐదు ఏళ్లు మేము మీకు సేవ చేసి చూపిస్తామన్నారు. ఎన్నికలు వస్తుండటంతోనే కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నేతలు ప్రజల ముందుకు వస్తారు... తర్వాత వాళ్ల అడ్రాస్ కూడా దొరకదన్నారు.
రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద భరోసా లేదు, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం లేదు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే బీజేపీ ఇవ్వడం లేదని ఆరోపీంచారు. బీజేపీలో ఉన్న దత్తాత్రేయను ఊడగొట్టి, తెలంగాణకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీకి ఓటేస్తే మోదీకి లాభం, కాంగ్రెస్కు పార్టీకి ఓటేస్తే రాహుల్కు లాభం. కానీ మన టీఆర్ఎస్కు ఓటేస్తే తెలంగాణకు లాభం జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment