వాషింగ్టన్: వర్ధమాన దేశాలకు చేసిన వాగ్దానాలను, పర్యావరణం సహా కీలక అంశాలపై హామీలను నెరవేర్చడం తదితరాలు జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రాథమ్యాలు కానున్నాయి. ఆయన భారత పర్యటనకు సంబంధించి బుధవారం చేసిన ప్రకటనలో వైట్‌హౌస్ ఈ మేరకు పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జీ20 సదస్సు గొప్పగా విజయవంతం అవుతుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ ఆశాభావం వెలిబుచ్చారు. బైడెన్ గురువారం భారత్ రానున్నారు. శుక్రవారం ఆయన మోదీతో భేటీ అవుతారు. శని, ఆదివారాల్లో జీ20 భేటీలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment