
న్యూఢిల్లీ: జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య ప్రపంచ, వ్యూహాత్మక స్థాయి భాగస్వామ్యాన్ని మరింతగా దృఢతరం చేసుకోవడమే చర్చల ప్రధాన అజెండా కానుంది.
స్వచ్ఛ ఇంధనం, వర్తకం, హై టెక్నాలజీ, రక్షణ వంటి రంగాల్లో ప్రస్తుత పరస్పర సహకారాన్ని సమీక్షించి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సమస్యలను అధిగమించే మార్గాలపై నేతలు దృష్టి సారిస్తారు. బైడెన్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకుంటారు. ఆదివారం జీ 20 సదస్సు ముగియగానే వియత్నాం బయల్దేరతారు. మోదీ, ఇతర నేతలతో ఈ వారాంతంలో ఫలప్రదమైన చర్చల కోసం బైడెన్ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారని వైట్ అండ్ హౌజ్ ప్రెస్స్ కార్యదర్శి కరిన్ జీన్ పియరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చివరిసారిగా 2020లో భారత్‌ను సందర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.