ravichandra reddy
-
ఏపీలో టీడీపీకి కాంగ్రెస్ తోకపార్టీ.. షర్మిలను రేవంత్ గెలిపిస్తాడంట!
గుంటూరు, సాక్షి: ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో భూస్థాపితం అయ్యిందని.. అలాంటి పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తోందన్నారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి. వైఎస్సార్ జయంతి వేడుకల పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన హడావిడిని రవిచంద్రారెడ్డి ఎండగట్టారు.మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో భూస్థాపితం అయింది. ప్రస్తుతం టీడీపీకి కాంగ్రెస్ తోకపార్టీ. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది. కేవలం తన అన్న జగన్ మీద కోపంతోనే షర్మిల పార్టీ నడుపుతోంది. వైఎస్సార్ మీద అంత మమకారం ఉంటే.. ఆయన పేరును చంద్రబాబు తొలగిస్తుంటే షర్మిల ఎందుకు మాట్లాడడం లేదు?. .. కడపలో బై ఎలక్షన్ వస్తుందని ఎల్లోమీడియాలో వార్తలు వచ్చాయి. దాన్ని పట్టుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడే కూర్చుని ఉంటారని అనడం విడ్డూరం. మహబూబ్ నగర్ గెలిపించుకోలేని రేవంత్.. కడపలో షర్మిలను గెలిపిస్తాడంట. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందాలు అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపమే విభజననష్టం. ప్రత్యేక హోదా, పెండింగ్ ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదు?.. .. వైఎస్సార్ కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తే.. జగన్ అంతకుమించి చేశారు. ప్రజల గుండెల్లో జగన్ గొప్పగా ఉన్నారు. ఎన్నికల్లో జరిగిన మాయాజాలం గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అయినా దాని గురించి ప్రస్తుతం మేము మాట్లాడదల్చుచుకోలేదు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి పొత్తుల కోసం వెంపర్లాడలేదు. మేము పొత్తు లు పెట్టుకుంటే చంద్రబాబు గెలిచేవాడే కాదు. చంద్రబాబు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నాం. ఆ తర్వాత ప్రజాపోరాటాలు చేస్తాం అని రవిచంద్రారెడ్డి అన్నారు. -
దాడులు పక్కనపెట్టి, సంపద సృష్టిపైన దృష్టి పెట్టండి
-
చంద్రబాబూ.. ఆ మాటలు ఏమయ్యాయి?: రవిచంద్రా రెడ్డి
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబు ప్రభుత్వం మూడు వారాల్లోనే పది వేల కోట్ల అప్పులు చేసిందని.. సంపద సృష్టించడం ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని బాబు అధికారంలోకి వచ్చారు.. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు మాటలు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నించారు వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.రవిచంద్రా రెడ్డి.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థను బాబు పక్కనపెట్టారు.. వాలంటీర్లకు పది వేల రూపాయల ఇస్తామన్న మాట ఏమైంది? అని మండిపడ్డారు. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి ఇస్తామన్న 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు?.రైతులకు నిధులు ఏ తేదీన విడుదల చేస్తారో చెప్పాలి’’ అని రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తల వ్యాపారాలు, ఆస్తులపైన దాడులు చేస్తున్నారు. పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాడులు పక్కనపెట్టి, సంపద సృష్టిపైన దృష్టి పెట్టండి. టీడీపీ కార్యకర్తలను సంయమనం పాటించేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలి’ అని రవిచంద్రారెడ్డి అన్నారు. -
వైఎస్ జగన్‌కు చెడు జరగాలని కోరుకుంటున్నారా?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెక్యూరిటీని తెల్లారేసరికి తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కె.రవిచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఆయనకు చెడు జరగాలని కోరుకుంటున్నారా? లేక మీ స్పాన్సర్డ్ మీడియాను పంపి హడావుడి చేయిస్తారా? అని నిలదీశారు. ఆయన మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వీఐపీలు ఉండే రోడ్లలో చెక్‌పోస్ట్‌లు ఉండటం, ఐడీ కార్డు అడగడం ప్రతిచోటా ఉంటుందని చెప్పారు. తమ పార్టీ తరపున కేంద్రానికి అప్పీల్ చేస్తున్నామని, వైఎస్ జగన్‌కి వీలైనంత త్వరగా జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించాలని కోరుతూ కేంద్రానికి రిప్రజెంటేషన్ కూడా ఇస్తామని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ప్రభుత్వ ఉద్యోగులు చాలా విలువను పొందుతున్నామని అనుకుంటున్నారేమోగానీ ఉద్యోగులపై అప్పుడే చంద్రబాబు వివక్ష మొదలైంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను ఈనాడులో జలగన్నలంటూ రాశారు. అధికారులను అవమానిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ అధికారులను అదిరించి, బెదిరించి తన అజమాయిషీ చాటుకున్నారు. వారిని అనేక రకాలుగా అవమానించారు. మేం ఇంత త్వరగా రెస్పాండ్ కాకూడదని, ఈ ప్రభుత్వానికి 3 నెలలో, 6 నెలలో సమయం ఇవ్వాలని అనుకున్నాం. అప్పటివరకు ఆరోపణలు చేయకూడదనుకున్నాం. ప్రజలకిచ్చిన హామీలు అమలుచేయకపోతే నిలదీయాలనుకున్నాం. కానీ ప్రభుత్వ అధికారులను అవహేళన చేసేవిధంగా రాయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాం. 2014 నుంచి 2019 వరకు డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు రాజమౌళి ఐఏఎస్, కేవీవీ సత్యనారాయణ, వెంకయ్యచౌదరి, కల్నల్ అశోక్‌బాబు, సంధ్యారాణి (పోస్టల్ డిపార్ట్మెంట్), గురుమూర్తి (సెంట్రల్ సర్వీస్), శ్రీనివాస్ (సర్వశిక్షా అభియాన్), జాస్తి కృష్ణకిశోర్ (తాళాలన్నీ ఇతడికే ఇచ్చారు కదా), వెంకటేశం (సమాచార కమిషనర్), రమణారెడ్డి (రైల్వే శాఖ).. వీరందరికీ ఇలాంటి పేర్లు ఏం పెట్టాలి? వీరంతా అనకొండలా లేక కొండచిలువలా? మేం ప్రశ్నిస్తున్నది సదుద్దేశంతోనే. అంతేగానీ అవహేళన చేయడానికి కాదు. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ దాడులు దేనికి నిదర్శనం? రాబోయే రోజుల్లో మీరే చింతించాలి. ప్రజలంతా గమనిస్తున్నారు. -
‘బాబు రియాక్షన్ చూస్తుంటే.. అసలు దొంగ ఆయనే అనిపిస్తోంది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడు ప్రవర్తన చూస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిచేయించిన అసలు దొంగ ఆయనే అనిపిస్తుందన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి. ముందు జాగ్రత్త కోసం దొంగే..దొంగా..దొంగా అని అరుస్తున్నాడేమోనని అన్నారు. నీ వరకూ వస్తుందని భుజాలు తడుముకుంటున్నావా బాబు అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే టీడీపీ అంటే టోటల్‌గా దివాళా తీసే పార్టీ అయిందని, జూన్ 4 నాటికి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీగా మిగలనుందని విమర్శించారు. కనుమూరి రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమని సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చంద్రబాబు ఆందోళన చేందుతున్నారు. పోలీసు అధికారులు వైఎస్సార్సీపీ ప్రమేయంతో పనిచేస్తున్నారని దుర్మార్గమైన స్టేట్ మెంట్ ఒకటి ఇచ్చాడు. చంద్రబాబూ...ఇంత వరకూ పోలీసులు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. వారి దర్యాప్తు గురించి కానీ, ఎవరిని విచారిస్తున్నారన్న విషయం కానీ, ఎవరి పేర్లు అందులో ఉన్నాయన్నది ఏదీ పోలీసులు ఇంకా చెప్పలేదు. అలాంటప్పుడు మీకు ఏం సమాచారం ఉండి ఇలాంటి ప్రెస్ రిలీజ్ ఇచ్చారో సమాధానం చెప్పాలి. అధికారికంగా చంద్రబాబు ఇలాంటి ప్రెస్‌నోట్ ఇస్తున్నారంటే మీరు భుజాలు తడుముకుంటున్నట్లు అర్థం కావడంలేదా? కచ్చితంగా మీరు దొరికిపోయారని, మీరే ఈ దాడి చేయించారని చెప్పకనే చెప్తున్నారు. మీరు గుంటూరు దాటిన తర్వాత జగన్ బస్సు యాత్రకు క్రేజ్ తగ్గుతుందని భావించారు. కానీ గుంటూరు నుంచి విజయవాడ వచ్చే సరికి కృష్ణా వారధి పోటెత్తడంతో పాటు విజయవాడ జనసంద్రంగా మారింది. ఆ జన ప్రవాహాన్ని చూసి ఓర్చుకోలేక మీరే ముఖ్యమంత్రి జగన్‌పై దాడి చేశారని ఖచ్చితంగా అర్థం అవడం లేదా? మీరే చెప్తున్నట్లు, ఈ దాడి వెనక బోండా ఉమ ఉన్నట్టు మీరు చెప్తున్నారంటే... చివరకు ఈ కేసు మీ వరకూ వస్తుందని భయపడుతున్నారా చంద్రబాబు? వాళ్ల స్పందన చూస్తే అసలు దొంగ చంద్రబాబేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తన పేరు ఎక్కడ బయటకు వస్తుందోనని బాబు భయపడుతున్నాడా అనే సందేహం కలుగుతోంది. అసలు చంద్రబాబుకు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? ముందు జాగ్రత్త కోసం దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా అరుస్తున్నాడు. ఖచ్చితంగా ఈ దాడి చేయించింది చంద్రబాబే అనేది వారి స్పందన చూస్తే తెలుస్తోంది. ఇప్పటికే వస్తున్న సమాచారం మేరకు బోండా ఉమా ఫోన్ స్విచ్ఆఫ్ చేశారని తెలుస్తోంది. బోండా ఉన్నాడో.. బజ్జీ ఉన్నాడో మీకెలా తెలుసు బాబూ?: పోలీసులు ఎవరు అధికారికంగా విచారణపై నోరెత్తకపోతే ఏ బోండా ఉన్నాడో..ఏ బజ్జీ ఉన్నాడో మీకెలా తెలుసు చంద్రబాబు? జగన్ యాత్ర గుంటూరు, విజయవాడలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో జన గోదారి అయ్యాయి. దీంతో బెంబెలెత్తిపోయి, ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు. మీరు చేస్తున్న యాత్రలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. మీరు, పవన్, పురందేశ్వరితో కలిసి చేస్తున్న యాత్రలు ఏ విధంగా ప్లాప్ అవుతున్నాయో మీకు తెలుసు. అందుకే మీ ఓర్వలేని తనం అడుగడుగునా కన్పిస్తోంది. బాలకృష్ణ యాత్ర కర్నూలు జిల్లాలో జనం లేక వెలవెల పోయింది. మీ ఉత్త పుత్రుడు నారా లోకేశ్ ఏ సభకూ పనికిరాడని మీరే పక్కన పెట్టారు. మీ దత్తపుత్రుడు ఫ్రస్టేషన్ ఎక్కువై తెనాలిలో పూనకం వచ్చినట్లు ఊగిపోవడం చూస్తే అనేక అనుమానాలు వస్తున్నాయి. అతనేమన్నా మత్తు మందుకు బానిస అయ్యాడా, లేక మందు సేవించి అలా ప్రవర్తిస్తున్నాడా అనే అనుమానాలున్నాయి. మీ కూటమి పూర్తిగా విఫలమైందనేది వీటన్నిటిని బట్టి తెలుస్తోంది. మీలో అణువణువునా ఫ్రస్టేషన్ కనిపిస్తోంది: మీకు అణువణువునా టెన్షన్, ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే ఫ్రస్టేషన్‌కి గురవుతున్నారు. మీ మాయాకూటమిలో ఉన్నది దుష్టచతుష్టయం. కుట్రలే ఎజెండాగా ఏర్పడిన ఈ కూటమి భవిష్యత్తు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెల్లారిపోతుంది. రామోజీ మార్గదర్శి అక్రమాల కేసులలో పీకల్లోతులో మునిగి ఉన్నాడు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఉనికి గల్లంతు అవుతుందని భయం. రాధాకృష్ణ, బీఆర్నాయుడులకు తమ భవిష్యత్తు ఏమవుతుందోనని భయంతో ఉన్నారు. అందుకే, నిత్యం నెగిటివ్ న్యూస్ ద్వారా అధికారం సాధించాలనే ఎత్తుగడ మీది. కానీ జగన్ ముఖ్యమంత్రిగా 99 శాతం హామీలు అమలు చేసి, 2.70 లక్షల కోట్లు దళారీలు లేకుండా డిబిటీ ద్వారా ప్రజలకు అందించారు. జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా చేసి, నేను చేసిన మేలు మీకు చేరిఉంటేనే నాకు ఓటేయమని అడుగుతున్న రియల్ హీరో జగన్‌గారు. ప్రతి గడపకూ సేవలందించిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. మీరు చెప్పుకునేందుకు ఏమీ లేక చేతులెత్తేసిన మీరు ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ ఓట్లడగడానికి సిగ్గుగా లేదా? జూన్4కి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీ: ఇప్పటికే టీడీపీ అంటే టోటల్‌గా దివాళా తీసే పార్టీ అయింది. జూన్4 మధ్యాహ్నానికి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీగా మిగలనుంది. -
ఎల్లో మీడియా క్షణక్షణం ప్రజల్ని భయపెడుతోంది
సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ చంద్రబాబు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి మండిపడ్డారు. సోమవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో కరోనాతో సెకనుకు ఒకరు చనిపోతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు. రాష్ట్రంలో టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేస్తున్నారు కాబట్టే కేసులు పెరుగుతున్నాయి. తక్కువ టెస్టులు చేస్తే కరోనా వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉంది. ధైర్యం నింపాల్సిన సమయంలో ఎల్లో మీడియా క్షణక్షణం ప్రజల్ని భయపెడుతోంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. (వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత ఫైర్) -
వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి
-
కాంగ్రెస్‌పై ఉన్న అపోహలు తొలగిస్తాం
హిందూపురం అర్బన్ : రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న కోపాన్ని.. అపోహలను తుడిచి వేసి వారిని చైతన్యపరిచే దిశగా కృషి చేస్తున్నామని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు, అనంతపురం ఇన్చార్జి రవిచంద్రారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీని పటిష్టపరిచే దిశగా నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాలో చెíప్పిన మాటలకు వాస్తవ పరిస్థితులకు పూర్తిగా భిన్నంగా ఉంటోందన్నారు. ప్రజాసేవ చేసే ఓపిక లేకపోతే సినిమా షూటింగులకే పరిమితమై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోటా సత్యం, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్, పీసీసీ కార్యదర్శి ఇందాద్, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు రవూఫ్, ఏ బ్లాక్ కన్వీనర్ శైవలి రాజశేఖర్, సీనియర్ నాయకులు ఆదిమూర్తి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, జిల్లా నాయకులు చిన్నవెంకటరాముడు, యూత్ కాంగ్రెస్ నాయకులు రహెమత్, జబీ తదితరులు పాల్గొన్నారు.