హిందూపురం అర్బన్ : రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న కోపాన్ని.. అపోహలను తుడిచి వేసి వారిని చైతన్యపరిచే దిశగా కృషి చేస్తున్నామని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు, అనంతపురం ఇన్‌చార్జి రవిచంద్రారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీని పటిష్టపరిచే దిశగా నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని విమర్శించారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాలో చెíప్పిన మాటలకు వాస్తవ పరిస్థితులకు పూర్తిగా భిన్నంగా ఉంటోందన్నారు. ప్రజాసేవ చేసే ఓపిక లేకపోతే సినిమా షూటింగులకే పరిమితమై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోటా సత్యం, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్, పీసీసీ కార్యదర్శి ఇందాద్, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు రవూఫ్, ఏ బ్లాక్ కన్వీనర్ శైవలి రాజశేఖర్, సీనియర్ నాయకులు ఆదిమూర్తి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, జిల్లా నాయకులు చిన్నవెంకటరాముడు, యూత్ కాంగ్రెస్ నాయకులు రహెమత్, జబీ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌పై ఉన్న అపోహలు తొలగిస్తాం
Published Wed, Nov 2 2016 10:32 PM | Last Updated on Mon, Mar 18 2019 8:56 PM
Advertisement