‘బాబు రియాక్షన్‌ చూస్తుంటే.. అసలు దొంగ ఆయనే అనిపిస్తోంది’ | YSRCP Leader Kanumuri Ravichandra Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘బాబు రియాక్షన్‌ చూస్తుంటే.. అసలు దొంగ ఆయనే అనిపిస్తోంది’

Published Wed, Apr 17 2024 6:00 PM | Last Updated on Wed, Apr 17 2024 6:41 PM

YSRCP Leader Kanumuri Ravichandra Reddy Fires On Chandrababu - Sakshi

సీఎం జగన్‌పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..

ముందు జాగ్రత్త కోసం దొంగే..దొంగా..దొంగా అని అరుస్తున్నాడేమో? 

బోండా వరకూ వచ్చిందంటే.. నీ పేరు బయటకు వస్తుందని భుజాలు తడుముకుంటున్నావా బాబూ?

జూన్‌4 నాటికి  టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీగా మిగలనుంది.

వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడు ప్రవర్తన చూస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిచేయించిన అసలు దొంగ ఆయనే అనిపిస్తుందన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి. ముందు జాగ్రత్త కోసం దొంగే..దొంగా..దొంగా అని అరుస్తున్నాడేమోనని అన్నారు. నీ వరకూ వస్తుందని భుజాలు తడుముకుంటున్నావా బాబు అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే టీడీపీ అంటే టోటల్‌గా దివాళా తీసే పార్టీ అయిందని, జూన్‌ 4 నాటికి  టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీగా మిగలనుందని విమర్శించారు.

కనుమూరి రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ..

  • టీడీపీ విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి బొండా ఉమని సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చంద్రబాబు ఆందోళన చేందుతున్నారు. 
  • పోలీసు అధికారులు వైఎస్సార్సీపీ ప్రమేయంతో పనిచేస్తున్నారని దుర్మార్గమైన స్టేట్‌ మెంట్‌ ఒకటి ఇచ్చాడు. 
  • చంద్రబాబూ...ఇంత వరకూ పోలీసులు ఎటువంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. 
  • వారి దర్యాప్తు గురించి కానీ, ఎవరిని విచారిస్తున్నారన్న విషయం కానీ, ఎవరి పేర్లు అందులో ఉన్నాయన్నది ఏదీ పోలీసులు ఇంకా  చెప్పలేదు. 
  • అలాంటప్పుడు మీకు ఏం సమాచారం ఉండి ఇలాంటి ప్రెస్‌ రిలీజ్‌ ఇచ్చారో సమాధానం చెప్పాలి. 
  • అధికారికంగా చంద్రబాబు ఇలాంటి ప్రెస్‌నోట్‌ ఇస్తున్నారంటే మీరు భుజాలు తడుముకుంటున్నట్లు అర్థం కావడంలేదా? 
  • కచ్చితంగా మీరు దొరికిపోయారని, మీరే ఈ దాడి చేయించారని చెప్పకనే చెప్తున్నారు. 
  • మీరు గుంటూరు దాటిన తర్వాత జగన్‌ బస్సు యాత్రకు క్రేజ్‌ తగ్గుతుందని భావించారు. 
  • కానీ గుంటూరు నుంచి విజయవాడ వచ్చే సరికి కృష్ణా వారధి పోటెత్తడంతో పాటు విజయవాడ జనసంద్రంగా మారింది. 
  • ఆ జన ప్రవాహాన్ని చూసి ఓర్చుకోలేక మీరే ముఖ్యమంత్రి జగన్‌పై దాడి చేశారని ఖచ్చితంగా అర్థం అవడం లేదా?
  • మీరే చెప్తున్నట్లు, ఈ దాడి వెనక బోండా ఉమ ఉన్నట్టు మీరు చెప్తున్నారంటే... చివరకు ఈ కేసు మీ వరకూ వస్తుందని భయపడుతున్నారా చంద్రబాబు? 
  • వాళ్ల స్పందన చూస్తే అసలు దొంగ చంద్రబాబేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 
  • తన పేరు ఎక్కడ బయటకు వస్తుందోనని బాబు భయపడుతున్నాడా అనే సందేహం కలుగుతోంది. 
  • అసలు చంద్రబాబుకు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? 
  • ముందు జాగ్రత్త కోసం దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా అరుస్తున్నాడు. 
  • ఖచ్చితంగా ఈ దాడి చేయించింది చంద్రబాబే అనేది వారి స్పందన చూస్తే తెలుస్తోంది. 
  • ఇప్పటికే వస్తున్న సమాచారం మేరకు బోండా ఉమా ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశారని తెలుస్తోంది. 

బోండా ఉన్నాడో.. బజ్జీ ఉన్నాడో మీకెలా తెలుసు బాబూ?:

  • పోలీసులు ఎవరు అధికారికంగా విచారణపై నోరెత్తకపోతే ఏ బోండా ఉన్నాడో..ఏ బజ్జీ ఉన్నాడో మీకెలా తెలుసు చంద్రబాబు? 
  • జగన్‌ యాత్ర గుంటూరు, విజయవాడలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో జన గోదారి అయ్యాయి. 
  • దీంతో బెంబెలెత్తిపోయి, ఇటువంటి కుట్రలకు  పాల్పడుతున్నారు. 
  • మీరు చేస్తున్న యాత్రలు అట్టర్‌ ప్లాప్‌ అవుతున్నాయి. 
  • మీరు, పవన్, పురందేశ్వరితో కలిసి చేస్తున్న యాత్రలు ఏ విధంగా ప్లాప్‌ అవుతున్నాయో మీకు తెలుసు.
  • అందుకే మీ ఓర్వలేని తనం అడుగడుగునా కన్పిస్తోంది. 
  • బాలకృష్ణ యాత్ర కర్నూలు జిల్లాలో జనం లేక వెలవెల పోయింది. 
  • మీ ఉత్త పుత్రుడు నారా లోకేశ్‌ ఏ సభకూ పనికిరాడని మీరే పక్కన పెట్టారు. 
  • మీ దత్తపుత్రుడు ఫ్రస్టేషన్‌ ఎక్కువై తెనాలిలో పూనకం వచ్చినట్లు ఊగిపోవడం చూస్తే అనేక అనుమానాలు వస్తున్నాయి. 
  • అతనేమన్నా మత్తు మందుకు బానిస అయ్యాడా, లేక మందు సేవించి అలా ప్రవర్తిస్తున్నాడా అనే అనుమానాలున్నాయి. 
  • మీ కూటమి పూర్తిగా విఫలమైందనేది వీటన్నిటిని బట్టి తెలుస్తోంది. 

మీలో అణువణువునా ఫ్రస్టేషన్‌ కనిపిస్తోంది:

  • మీకు అణువణువునా టెన్షన్, ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే ఫ్రస్టేషన్‌కి గురవుతున్నారు.
  • మీ మాయాకూటమిలో ఉన్నది దుష్టచతుష్టయం.
  • కుట్రలే ఎజెండాగా ఏర్పడిన ఈ కూటమి భవిష్యత్తు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెల్లారిపోతుంది. 
  • రామోజీ మార్గదర్శి అక్రమాల కేసులలో పీకల్లోతులో మునిగి ఉన్నాడు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఉనికి గల్లంతు అవుతుందని భయం. 
  • రాధాకృష్ణ, బీఆర్‌నాయుడులకు తమ భవిష్యత్తు ఏమవుతుందోనని భయంతో ఉన్నారు. 
  • అందుకే, నిత్యం నెగిటివ్‌ న్యూస్‌ ద్వారా అధికారం సాధించాలనే ఎత్తుగడ మీది. 
  • కానీ జగన్‌ ముఖ్యమంత్రిగా 99 శాతం హామీలు అమలు చేసి, 2.70 లక్షల కోట్లు దళారీలు లేకుండా డిబిటీ ద్వారా ప్రజలకు అందించారు. 
  • జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా చేసి, నేను చేసిన మేలు మీకు చేరిఉంటేనే నాకు ఓటేయమని అడుగుతున్న రియల్‌ హీరో జగన్‌గారు. 
  • ప్రతి గడపకూ సేవలందించిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. 
  • మీరు చెప్పుకునేందుకు ఏమీ లేక చేతులెత్తేసిన మీరు ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ ఓట్లడగడానికి సిగ్గుగా లేదా?

జూన్‌4కి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీ:

  • ఇప్పటికే టీడీపీ అంటే టోటల్‌గా దివాళా తీసే పార్టీ అయింది. 
  • జూన్‌4 మధ్యాహ్నానికి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీగా మిగలనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement