మీరు మంత్రివర్యులు కాదా?
ప్రజావాణిలో మంత్రిని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులు
అనంతపుంర అర్బన్: తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలను మంత్రి రఘునాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లాగా దీనిపై ఆయన మాట్లాడుతూ ఈ సమస్యల పరిష్కారానికి ఆ మంత్రిని కలవండి అని ఉచిత సలహా ఇవ్వడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి హాజరయ్యా రు. జిల్లా వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని వైఎస్సార్‌సీపీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాం నాయక్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కురుకుంటలోని వైఎస్సార్ కాలనీలో మరుగుదొడ్లు నిర్మించాలని ఆ కాలనీ వార్డు మెం బర్ జయలక్ష్మీబాయి, నాయకుడు శ్రీనివాస్ నాయక్ మంత్రికి విన్నవిం చారు. దీనిపై ఆయన ఆ మంత్రిని కలి స్తే.. మీ సమస్యలు పరిష్కరమవుతాయని వారికి సమాధానమిచ్చారు. దీంతో నాయకులు ‘మీరు మంత్రి కాదా..? మీకు మంత్రి హోదా లేదా..? సమస్యలపై మీరు ఇలాంటి సమాధానం ఇవ్వడం తగునా..?’ అని మంత్రిని ప్రశ్నించారు.
ధర్మవరం, బుక్కపట్నం, ముది గుబ్బ, కదిరి మండలాల పరిధిలోని గిరిజన గ్రామాల్లో తాగునీటి కోసం అల్లాడుతున్నార న్నారు. ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని కోరారు. మరుగుదొడ్లు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని సమస్యను కలెక్టర్ దృష్టికి తెచ్చినా ఫలితం లేదని మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను పిలిచి ఈ రెండు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
షరతులులేని పింఛన్లు ఇవ్వండి : వికలాంగులకు షరతులులేని పింఛన్లు, ఇళ్ల పట్టాలు, అంత్యోదయ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు షఫి, మల్లికార్జున, అలివేలు,తదితరులు మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిని కోరారు.
సమస్యలు పరిష్కరించండి..
క్రైస్తవ మతం (మార్గం) స్వీకరించిన షెడ్యూల్ కులాలవారు ప్రభుత్వం సం క్షేమ, అభివృద్ధి ఫలాలను అందుకోలేకపోతున్నారని ఆల్ ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నాయకులు ప్రజావాణిలో ఏజేసీ సయ్యద్ కాజామొహిద్దీన్‌కు విన్నవించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హో దాకై అసెంబ్లీ తీర్మానం చేసి తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కమిటీ అధ్యక్షుడు ఎన్. కమలాకర్‌రావు, ప్రధాన కా ర్యదర్శి డానియల్, తదితర నాయ కులు కోరారు.
క్లస్టర్స్ స్కూళ్ల ఏర్పాటును ఉపసంహ రించాలి : క్లస్టర్ స్కూళ్ల ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. ఓబులు, జిల్లా అధ్యక్షుడు ఎం. ఇంతియాజ్ డీఆర్‌ఓ హేమసాగర్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రజావాణిలో ఏజేసీతోపాటు డీఆర్‌ఓ సీహెచ్ హేమసాగర్, అటవీశాఖ సెంటిల్‌మెంట్ అధికారి చక్రపాణి అర్జీలు స్వీకరించారు. ఇస్కాన్ ట్రస్టు ఆధ్వర్యంలో లాభాపేక్ష లేకుండా పెరుగు అన్నం, పులి హోరా ఐదు రూపాయల చొప్పున అర్జీదారులకు అందజేశారు.