
9గంటల ఉచిత విద్యుత్ ఎప్పటినుంచి?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ కోతలను సభ దృష్టికి తీసుకు వచ్చారు. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఎప్పటి నుంచి ఇస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇందుకు సంబంధించి మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమాధానం ఇస్తూ వ్యవసాయానికి దశలవారీగా తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని, అక్టోబర్ 2వ తేదీ నుంచి గృహాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.