
చంద్రబాబును కావాలనే ఇరికించింది
తమ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని ఓటుకు నోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఇరికించిందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు.
అనంతపురం : తమ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని ఓటుకు నోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఇరికించిందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. మంగళవారం అనంతపురంలో పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ... ఏసీబీ ఛార్జిషీట్లో చంద్రబాబు పేరును కావాలనే ప్రస్తావించారని విమర్శించారు. చంద్రబాబుపై ఇప్పటిదాకా 25 కేసులు నమోదయ్యాయన్నారు.
అయితే విచారణలో ఎక్కడ చంద్రబాబు తప్పు చేసినట్లు నిరూపితం కాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం ఎక్కడ చెప్పలేదని పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చే క్రమంలో ఇబ్బందులుంటాయని మాత్రమే కేంద్రం అంటోందని ఆయన గుర్తు చేశారు.