మంత్రి పల్లె రఘునాథరెడ్డి
పుట్టపర్తి టౌన్/అర్బన్ : కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో వివిధ పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి అవకాశాలు పెంపొదిస్తామని సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. జేసీ లక్ష్మికాంతం, ఆర్‌డీఓ రాజశేఖర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రంజిత్,శ్రే యి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రతినిధులు అభిషేక్, రామరాజు, ఆర్‌ఆర్ సౌరశక్తి డెరైక్టర్ వేద్ ఆలపాటి, వ్యాల్యూథాట్ ఐటీ కంపెనీ సీఈఓ మహేష్ నంద్యాల,పండిట్ వ్యూ సాప్ట్‌వేర్ కంపెనీ ప్రెసిడెంట్ తాళంకి శ్రీధర్‌లతో కలిసి కప్పలబండ గ్రామంలో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో కంపెనీత ప్రతినిధులతో కలిసి మాట్లాడారు.
పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ 400 ఎకరాల్లో విమానాల విడిభాగాల త యారీ, విమానాలకు ఇంధన రీఫిల్లింగ్, విమానాల మరమ్మతులు తదితర సంస్థలను స్థాపించేందుకు ఆసక్తి చూపుతోందన్నారు. ఆర్‌ఆర్ సౌరశక్తి సంస్థ 10 ఎకరాల్లో రూ. 600 కోట్ల పెట్టుబడితో సౌరశక్తి పలకల తయారీ సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తోందన్నారు. వాల్యూథాట్ ఐటీ కంపెనీ ఇప్పటికే అనంతపురం జిల్లాలో తన కార్యకలాపాలను ప్రారంభించిందని, ఈ సంస్ధ ద్వారా 200 మందికి ఉపాధి అ వకాశాలు లభించనున్నాయన్నారు. తహసీల్దార్ సత్యనారాయణ, చైర్మన్ సీసీ గంగన్న, వైస్ చైర్మన్ కడియాలరాము, దేశం నాయకులు ఆదినారాయణరెడ్డి, కడియాల సుధాకర్, రామాంజినేయులు పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలు
Published Fri, Aug 7 2015 3:11 AM | Last Updated on Wed, Aug 29 2018 7:39 PM
Advertisement
Advertisement