వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలకు త్వరలో ఏపీ వేదిక అవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో నాస్కామ్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది.
నాస్కామ్ ఆధ్వర్యంలో విశాఖలో ఐటీ స్టార్టప్స్ వేర్‌హౌస్
సాక్షి, హైదరాబాద్: వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలకు త్వరలో ఏపీ వేదిక అవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో నాస్కామ్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై నాస్కామ్ తరపున ఆర్. చంద్రశేఖర్, ప్రభుత్వం తరపున మంత్రి పల్లె రఘునాధరెడ్డి సంతకాలు చేశారు.
దేశవ్యాప్తంగా 10 వేల అంకుర సంస్థలను ఏర్పాటు చేయాలని నాస్కామ్ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని విశాఖలో తొలుత ప్రారంభించనుంది. విశాఖలో ఆగస్టులో ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్స్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అమెజాన్ క్లౌడ్ టెక్నాలజీని ఉపయోగించటం ద్వారా ఏపీని మోడల్ రాష్ట్రంగా తయారు చేయాల్సిందిగా తనతో సమావేశమైన ఆ సంస్థ ప్రతినిధులు పీటర్ మూరే, సోమర్ విల్లేలను సీఎం కోరారు.