ప్రతిష్టాత్మకంగా అమరావతి శంకుస్థాపన
వివరాలు వెల్లడించిన మంత్రి పల్లె
సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యం త ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు ఏపీ సమాచార ప్రసార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. నగరంలోని ఓ హోటల్‌లో నటుడు సాయికుమార్, గాయని సునీతతో కలసి బుధవారం నిర్వహిం చిన మీడియా సమావేశంలో అమరావతి శంకుస్థాపన, సాంస్కృతిక కార్యక్రమాలను వెల్లడించారు. గురువారం ఉదయం 9:45గంటల నుంచి మధ్యాహ్నం 1.46గంటల వరకు జరిగే షెడ్యూల్‌ను ఆయన వివరించారు.
ఉదయం 9:45-9:50 గంటల వరకు గుమ్మడి గోపాలకృష్ణతో అమరావతి గీతం, 9:50-10.00 కామేశ్‌తో మచ్చలేని చంద్రుడు నృత్యరూపకం, 10.00-10:20 వరకు అంబిక మిమిక్రీ, 10:20-10:30 వరకు రైతు వందనం నృత్యరూపకం, 10:30-10:40 వరకు సురేశ్ గీతాలాపన, 10:40-10:50 వరకు కూచి భట్ల ఆనంద్ జయ జయహే అమరావతి గీతం, 10:50-11.00 వరకు తమిళనాడుకు చెందిన సురేశ్‌తో గరగాట, 11.00-11:10 వరకు కుమారి అంబి కా రింగ్‌డ్యాన్స్, 11:10-11:20వరకు వందేమాతరం శ్రీనివాస్ రైతు వందనం గీతం, 11:20-12:15 వరకు శివమణి డ్రమ్‌షో, 12:30 గంటలకు ప్రధాని మోదీ రాక, 12:30-12:35 వరకు అమరావతి విశేషాల గ్యాలరీ పరిశీలన, 12:35-12:43 వరకు శంకుస్థాపన, 12:43 గంటలకు వేదికపైకి ప్రధాని రాక, 12:48 గంటలకు మా తెలుగుతల్లి గీతం, 12:50 గంటలకు బెలూన్ల ఎగురవేత, 12:50-1:11 వరకు సింగపూర్, జపాన్ మంత్రులు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు ఉపన్యాసాలు, 1:11-1:43 వరకు ప్రధాని మోదీ ప్రసంగం, 1:46 గంటలకు ప్రధాని సభా ప్రాంగణం నుంచి వీడ్కోలు. ఈ కార్యక్రమాల్లో సాయికుమార్, సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారని మంత్రి పల్లె చెప్పా రు. మీడియా సమావేశం అనంతరం క్రీడల్లో ర్రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన కరణం మల్లేశ్వరి(వెయిట్‌లిఫ్టింగ్), సత్తిగీత(రన్నింగ్)లను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టూరిజం, కల్చరల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్, శాప్ చైర్మన్ మోహన్ పాల్గొన్నారు.