'విద్యుత్ లోటు భర్తీకి ప్రయత్నిస్తున్నాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన విద్యుత్ లోటు భర్తీకి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఏపీ కేబినెట్ వివరాలను వెల్లడించిన ఆయన కర్నూల్ జిల్లా పాణ్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ మార్కెట్ ద్వారా విద్యుత్ లోటు భర్తీకి యత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఎన్టీపీసీకి 5,500 ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు.
మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడగిస్తున్నట్లు రఘునాథ్ రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ పై నిషేధాన్ని ఏడాది పొడగిస్తున్నట్లు ఆయన తెలిపారు.