నీటి ఎద్దడి నివారణకు రూ.13.06 కోట్లు
మంత్రి పల్లె రఘునాథరెడ్డి
పుట్టపర్తి టౌన్: వేసవిలో జిల్లాలో నీటి ఎద్దడి నివారణ చర్యలకు ప్రభుత్వం రూ.13.06 కోట్లు మంజూరయ్యాయని సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిలర్లతో తాగునీటి సమస్యపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ అవసరమైన పైపులైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను అదేశించారు. జిల్లాలో 13 మండలాలకు చెందిన 41 గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందన్నారు. ఆ గ్రామాల్లో ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామన్నారు.
నగర పంచాయతీలో స్వచ్ఛభారత్ కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని అరోపణలు వినిపిస్తున్నాయని,ఎవరినీ వదిలే ప్రసక్తేలేదన్నారు.త్వరలో పుట్టపర్తిలో సత్యసాయి విమానాశ్రయం కేంద్రంగా ఏవియేషన్ అకాడమీని ప్రారంభిస్తామని,అనుబంధంగా పలు విమానయాన సంస్థలు పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయన్నారు.