
'రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని ప్రార్థించా'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వవైభవం రావాలని కనకదుర్గమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి తెలిపారు. దసరా పండగను రాష్ట్ర పండగగా నిర్వహిస్తామని చెప్పారు. శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గమల్లేశ్వరస్వామివారిని పల్లె రఘునాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ఎదుట పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు పల్లె రఘునాథ్రెడ్డికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శరన్న నవరాత్రులు సందర్బంగా ఇంద్రకీలాద్రిపై భక్త జనం పోటెత్తింది.