పర్యాటక కేంద్రంగా మంగినపూడి బీచ్
పర్యాటక కేంద్రంగా మంగినపూడి బీచ్
Published Thu, Aug 25 2016 9:09 PM | Last Updated on Wed, Aug 29 2018 7:39 PM
మంత్రి పల్లెరఘునాథరెడ్డి
మచిలీపట్నం(కోనేరుసెంటర్) :
మంగినపూడి బీచ్‌ను ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం రాష్ట్ర చేనేత, ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి బందరు మండలంలోని మంగినపూడి బీచ్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బందరుకు విశిష్టస్థానం ఉందన్నారు. బందరుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పోర్టును అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పారు. పోర్టు అభివృద్ధితో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని, భూముల విలువ పెరిగిపోతుందని పేర్కొన్నారు. కొత్త పరిశ్రమలు వస్తాయని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మంగినపూడి బీచ్‌ని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తొలుత మంత్రి రఘునాథరెడ్డి చిలకలపూడిలోని శ్రీపాండురంగ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, వైస్ ఎంపీపీ ఊసా వెంకట సుబ్బారావు, ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement