
'చంద్రబాబు... అభినవ శ్రీకృష్ణదేవరాయులు'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ... అభినవ శ్రీకృష్ణదేవరాయులలాంటి వాడని ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అభివర్ణించారు. శుక్రవారం న్యూఢిల్లీలో పల్లె రఘునాథరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ముస్లిం రిజర్వేషన్లకు కొన్ని విధానపరమైన లోపాలున్నాయని తెలిపారు. ఈ అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నామని చెప్పారు. ఆర్థిక వెనకబాటు ఆధారంగా ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. త్వరలోనే ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు రానుందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ చెబితే ఉప ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు.