తెనాలి: రాష్ర్టంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు అనేదానితో తాను ఏకీభవిస్తానని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. హోదా కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలు దానికంటే బాగుంటాయని నమ్ముతున్నానని అన్నారు. గురువారం రాత్రి చెన్నై వెళుతూ మార్గమధ్యంలో తెనాలి రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి మంత్రి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.