రాజకీయాలకు అతీతంగా పోరాటం
హంద్రీ నీవా పూర్తికి రూ.7వేల కోట్లు కేటాయించాలి
రాయలసీమ అభివృద్ధి వేదిక డిమాండ్
రాజకీయాలకు అతీతంగా పోరాటం
హంద్రీ నీవా పూర్తికి రూ.7వేల కోట్లు కేటాయించాలి
రాయలసీమ అభివృద్ధి వేదిక డిమాండ్
అనంతపురం సెంట్రల్ : జిల్లా అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పోరాడేందుకు సమాయత్తం కావాలని రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. వేదిక డిమాండ్లను ప్రభుత్వ దృ ష్టికి తీసుకెళ్లేందుకు జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ చమన్‌లతో సమావేశమయ్యారు. గేయానంద్‌తోపాటు, వేదిక సలహాదారుడు సింగమనేని నారాయణ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి హార్టీకల్చర్ హబ్, పారిశ్రామిక వాడలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, హంద్రీ నీవా పూర్తి, తదితర అనేక హామీలు ఇచ్చిందన్నారు. ఇందులో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదన్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి పథకానికి రూ.7వేల కోట్లు కేటాయిస్తే తప్పా పూర్తయ్యే దాఖలాలు లేవని వివరించారు.
జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు మన వాణిని గటి ్టగా వినిపించాలని సూచించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని వివరించారు. జెడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఒక వేదికను ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలతో ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మానవహక్కుల వేదిక నాయకులు ఎస్‌ఎం బాషౠ, సైన్స్ ఉద్యమ కార్యకర్త డాక్టర్ ప్రసూన, ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.