handri niva
-
రాజకీయాలకు అతీతంగా పోరాటం
హంద్రీ నీవా పూర్తికి రూ.7వేల కోట్లు కేటాయించాలి రాయలసీమ అభివృద్ధి వేదిక డిమాండ్ రాజకీయాలకు అతీతంగా పోరాటం హంద్రీ నీవా పూర్తికి రూ.7వేల కోట్లు కేటాయించాలి రాయలసీమ అభివృద్ధి వేదిక డిమాండ్ అనంతపురం సెంట్రల్ : జిల్లా అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పోరాడేందుకు సమాయత్తం కావాలని రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. వేదిక డిమాండ్లను ప్రభుత్వ దృ ష్టికి తీసుకెళ్లేందుకు జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ చమన్‌లతో సమావేశమయ్యారు. గేయానంద్‌తోపాటు, వేదిక సలహాదారుడు సింగమనేని నారాయణ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి హార్టీకల్చర్ హబ్, పారిశ్రామిక వాడలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, హంద్రీ నీవా పూర్తి, తదితర అనేక హామీలు ఇచ్చిందన్నారు. ఇందులో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదన్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి పథకానికి రూ.7వేల కోట్లు కేటాయిస్తే తప్పా పూర్తయ్యే దాఖలాలు లేవని వివరించారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు మన వాణిని గటి ్టగా వినిపించాలని సూచించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని వివరించారు. జెడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఒక వేదికను ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలతో ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మానవహక్కుల వేదిక నాయకులు ఎస్ఎం బాషౠ, సైన్స్ ఉద్యమ కార్యకర్త డాక్టర్ ప్రసూన, ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలానికి భారీగా వరద నీరు
ఎగువన వర్షపాతం నమోదు కావడంతో.. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ పరీవాహకప్రాంతాలైన జూరాల, తుంగభద్రల నుంచి శ్రీశైల జలాశయానికి సోమవారం వరద ప్రవాహం మొదలైంది. జూరాల నుంచి 6వేల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 4,479 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతికి 1,350 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. రెండు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పాదనను నిలిపివేసిన విషయం తెల్సిందే. జలాశయ పరిసర ప్రాంతాలలో 1.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 62.94 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 840.70 అడుగులకు చేరుకుంది. -
హంద్రీనీవా నీరు వృథా: భారీగా పంట నష్టం
హంద్రీనీవా ప్రాజెక్టు కాలువ తూముకు షట్టర్ వేయకపోవటంతో నీరు పంట పొలాలపైకి ప్రవహించి భారీగా పంట నష్టం సంభవించింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు వద్ద హంద్రీనీవా కాలువ తూము ఉంది. నీటి అవసరం తీరాక ఈ తూము షట్టర్‌ను రైతులు కిందికి దించుతుంటారు. మంగళవారం రాత్రి అలా చేయకపోవటంతో నీటి ఉధృతికి కాలువలో అడ్డుగా ఉంచిన ఇసుక బస్తాలు కొట్టుకుపోయాయి. వరద దిగువనున్న పంట పొలాలను ముంచెత్తింది. దీంతో దాదాపు వందెకరాల్లో చేతికి వచ్చే దశలో ఉన్న మొక్కజొన్న, పొగాకు నీటి పాలైంది. అర్థరాత్రి దాటిన తర్వాత గమనించిన రైతులు ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో డీఈ శ్రీనివాస నాయక్ నీటిని ఆపివేయించి, దెబ్బతిన్న చోట మరమ్మతులు చేపట్టారు. -
రైతులను మోసగిస్తే సహించం
- రైతు సదస్సులో అఖిల పక్ష జిల్లా నేతలు - కీలక నిర్ణయూలకు ఏకగ్రీవ ఆమోదం ఉరవకొండ: హంద్రీ నీవా మొదటి దశ కింద జిల్లాలోని 1.18లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వకుండా నీటిని అక్రమంగా చిత్తూరుకు తరలించి ఆయుుకట్టు రైతుల మధ్య చిచ్చు పెట్టాలని యత్నిస్తే సహించేది లేదని అఖిల పక్ష నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక వీరశైవ కళ్యాణ వుండపంలో సోవువారం ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు సదస్సులో రాష్ట్ర, జిల్లా నేతలు హాజరయ్యారు. సదస్సులో ఆమోదించిన తీర్మానాల్లో ముఖ్యమైనవి.. - జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రావుం లో హం ద్రీనీవా ఆయుకట్టు సాధన క మిటీల ఏర్పాటు - లక్ష సంతకాల సేకరణతో ఉద్యవుం ఉధృతం - హంద్రీ నీవా డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాలువల వద్ద రైతు నిద్ర - పంప్‌హౌస్‌ల దిగ్బంధం, అక్కడే జాగరణ -
టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం
శాసనసభలో వైఎస్ఆర్సీపీ సభ్యుల ధ్వజం నికర జలాలు రాకుండా పోయింది మీ హయాంలోనే హంద్రీ నీవా మెయిన్ కెనాల్ తక్షణమే పూర్తిచేయండి మండిపడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట 2016కల్లా హంద్రీ నీవా పూర్తిచేస్తామన్న మంత్రి దేవినేని సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని కరువు కాటకాల్లోకి నెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో సాగునీటి ప్రాజెక్టులపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. తొలుత రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజక వర్గం సాగు, తాగునీటికి కటకటలాడుతోందని, హంద్రీ నీవా మెయిన్ కెనాల్ పనుల ను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కెనాల్‌కి సంబంధించి ఇప్పటివరకూ ఏఏ పనులు కొనసాగించారో చెప్పాలని ప్రశ్నించారు. మదనపల్లి, పుంగనూరు బ్రాంచ్ కెనాల్లు పూర్తిచేయడంపై తమకేమీ అభ్యంతరం లేదని, కానీ ముందుగా మెయిన్ కెనాల్ పనులు పూర్తిచేయాలన్నారు. పుంగనూరు, మదనపల్లి బ్రాంచ్ కెనాల్లు తక్షణమే పూర్తిచేయాలని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిలు డిమాండ్ చేశారు. 1,500 అడుగులు బోర్లు వేసినా నీళ్లు లేవని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ కెనాల్లు పూర్తిచేయడం వల్ల లక్షలాది ఎకరాలు సాగు అవుతుందని పేర్కొన్నారు. దీనికి నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా బదులిస్తూ, అప్పటి వైఎస్ ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించలేకపోవడం వల్లే నికర జలాలు కోల్పోయామని చెప్పారు. పులివెందుల రైతులు తమ ప్రాంతానికి నీళ్లివ్వాలని కోరడంతో కుప్పం నియోజకవర్గానికి ఆపైనా సరే పులివెందులకు నీళ్లు ఇవ్వాలని సీఎం చెప్పారని పేర్కొన్నారు. హంద్రీ నీవా సుజల ప్రాజెక్టు రెండో దశకు ఇప్పటివరకూ రూ. 2,893 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ. 1,216 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశకు ఇంకా 5,481 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని దేవినేని ఉమా సమాధానమిచ్చారు. 2015-16 నాటికి హంద్రీ నీవా మెయిన్ కెనాల్ పనులు పూర్తిచేస్తామన్నారు. ఇళ్లు మేం కడితే కిటికీలు పెట్టి షోకులా? నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ సభ్యులు తీవ్రంగా ఆక్షేపించారు. 1994 నుంచి 2004 వరకూ అస్యూర్డ్ వాటర్(నికరజలాలు) రాకపోవడానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని గడికోట శ్రీకాంతరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నీ 70 శాతానికి పైగా మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయన్నారు. ఇళ్లు మేము పూర్తిచేస్తే, కిటికీలు మీరు పెట్టుకుని షో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాకముందే ఆలమట్టి ఎత్తు పెంచారని, అప్పట్లో కర్ణాటకకు సరైన కౌంటర్ ఇవ్వలేక ఇప్పుడు బురదజల్లే కార్యక్రమం చేపట్టారని దుయ్యబట్టారు.