హంద్రీనీవా ప్రాజెక్టు కాలువ తూముకు షట్టర్ వేయకపోవటంతో నీరు పంట పొలాలపైకి ప్రవహించి భారీగా పంట నష్టం సంభవించింది.
హంద్రీనీవా ప్రాజెక్టు కాలువ తూముకు షట్టర్ వేయకపోవటంతో నీరు పంట పొలాలపైకి ప్రవహించి భారీగా పంట నష్టం సంభవించింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు వద్ద హంద్రీనీవా కాలువ తూము ఉంది. నీటి అవసరం తీరాక ఈ తూము షట్టర్‌ను రైతులు కిందికి దించుతుంటారు. మంగళవారం రాత్రి అలా చేయకపోవటంతో నీటి ఉధృతికి కాలువలో అడ్డుగా ఉంచిన ఇసుక బస్తాలు కొట్టుకుపోయాయి. వరద దిగువనున్న పంట పొలాలను ముంచెత్తింది. దీంతో దాదాపు వందెకరాల్లో చేతికి వచ్చే దశలో ఉన్న మొక్కజొన్న, పొగాకు నీటి పాలైంది. అర్థరాత్రి దాటిన తర్వాత గమనించిన రైతులు ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో డీఈ శ్రీనివాస నాయక్ నీటిని ఆపివేయించి, దెబ్బతిన్న చోట మరమ్మతులు చేపట్టారు.