విశాఖలో ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ | Visakhapatnam Film Development Corporation | Sakshi
Sakshi News home page

విశాఖలో ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

Published Sun, Dec 11 2016 5:10 AM | Last Updated on Wed, Aug 29 2018 7:39 PM

విశాఖలో ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ - Sakshi

విశాఖలో ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

మంత్రి పల్లె రఘునాథరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు విశాఖలో ఫిలిం డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన 28 రాష్ట్రాల సమాచార శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌కు పరిమితమైన చిత్ర పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌లో ప్రోత్సహించడానికి విశాఖలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

ఈ విషయంపై చిత్ర పరిశ్రమ వర్గాలతో చర్చలు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. విశాఖలో ఫిలిం, టెలివిజన్‌ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమాచార శాఖ ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. పథకాల ప్రచారానికి ఆల్‌ ఇండియా రేడియో, దూరదర్శన్‌తోపాటు ఇతర అన్ని సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నామని పల్లె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement