విజయవాడ, తిరుపతిలో పాస్‌పోర్టు కార్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కేంద్రాన్ని కోరారు.
సాక్షి, హైదరాబాద్: విజయవాడ, తిరుపతిలో పాస్‌పోర్టు కార్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.13 జిల్లాలకు కనీసం మూడు పాస్ పోర్టు కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోస్తాంధ్ర ప్రజలకు విజయవాడలో, రాయలసీమ ప్రజలకు తిరుపతి లేదా కర్నూలులో, ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖలో పూర్తిస్థాయి పాస్‌పోర్టు కార్యాలయాలు ఉండాలన్నారు.