
సాక్షి, ఢిల్లీ: జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటుకుంది. వరుసగా రెండో ఏడాది కూడా స్వచ్చ సర్వేక్షన్‌లో జాతీయ అవార్డులు అందుకుంది. కాగా, స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి కార్పొరేషన్‌కు జాతీయ అవార్డు లభించింది.
అలాగే, విశాఖ, విజయవాడ, పుంగనూరు, పులివెందులకు కూడా స్వచ్చ సర్వేక్షన్ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సురేష్‌తో పాటుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment