డిజిటల్ ఆంధ్రాగా తీర్చిదిద్దుతాం | Makes as Digital Andhra | Sakshi
Sakshi News home page

డిజిటల్ ఆంధ్రాగా తీర్చిదిద్దుతాం

Published Thu, Aug 6 2015 2:48 AM | Last Updated on Wed, Aug 29 2018 7:39 PM

డిజిటల్ ఆంధ్రాగా తీర్చిదిద్దుతాం - Sakshi

డిజిటల్ ఆంధ్రాగా తీర్చిదిద్దుతాం

తిరుపతిలో ఐఐటీ ప్రారంభించిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
తిరుపతిమంగళం:
రాష్ట్రంలో ఐటీరంగాన్ని అభివృద్ధి చేసి, డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని ఐటీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. తిరుపతి కరకంబాడి రోడ్డులోని ఆర్‌సీఆర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సెంటర్ ప్రాంగణంలో బుధవారం ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకుబేషన్ సెంటర్‌ను, రేణిగుంట రోడ్డులోని కృష్ణతేజ విద్యాసంస్థల ప్రాంగణంలో ఐఐటీని  ప్రారంభించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ఏపీని ఎడ్యుకేషనల్ హబ్‌గా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే తిరుపతికి ఐఐటీని తీసుకొచ్చారన్నారు. ప్రతి పల్లెకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించి 4జీ సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. తద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, విద్య, వైద్య సమాచారం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తుందన్నారు. డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.460కోట్లు ఇప్పటికే కేటాయించిందన్నారు.

వచ్చే సంవత్సరం మార్చి కల్లా అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, కాకినాడ నగరాల్లో ఐటీని అభివృద్ధి చేస్తున్నామని, 19 కంపెనీల ప్రతినిధులు రాష్ట్రంలో తమ సంస్థలు స్థాపించడానికి ముందుకు వచ్చారని తెలిపారు. పుట్టపర్తిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. రాబోయే మూడేళ్లలో ఐటీ రంగంలో ఐదు లక్షలు, ఎలక్ట్రానిక్స్ రంగంలో నాలుగు లక్షల ఉద్యోగాలు టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 20 శాతం నిధులు ఐటీ ద్వారా పొదుపు అవుతోందని, రాబోయేది ఐటీ కాలమేనన్నారు. ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణనాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ పాల్గొన్నారు.
 
శ్రీరామ విద్యార్థులతో...
ఐఐటీ ప్రారంభం అనంతరం తిరుపతి-కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలను మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డితోపాటు రాష్ట్ర ఐటీ సలహాదారులు సత్యనారాయణ సందర్శించారు.  ఈ సందర్బంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడారు. 37ఐటీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. తద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తిరుపతి కేంద్రంగా ప్రారంభించిన ఇంక్యుబేషిన్ సెంటర్‌లో భాగస్వామ్యానికి స్టార్టప్ కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. 5వేలు స్టార్టప్స్‌ను రాష్ట్రంలో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
 
ఐటీ కంపెనీలకు పెట్టుబడులు పెట్టేందుకు ఇదే తరుణమన్నారు. చదలవాడ విద్యాసంస్థల అధినేత్రి చదలవాడ సుచరిత, శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల అధినేత మన్నెం రామిరెడ్డి, డెరైక్టర్లు మన్నెం అరవిందకుమార్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, బిసి వెంకటరెడ్డి, ప్రిన్సిపాల్ కె. జయచంద్రారెడ్డి, నాయకులు శ్రీధర్ వర్మ, గాలి సురేంద్రనాయుడు, నరిసింహయాదవ్, సూరా సుధాకర్‌రెడ్డి, ఊట్ల సురేంద్రరె డ్డి, మునిశేఖర్, పుష్పావతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement