
గవర్నర్ ధృతరాష్ర్టుడి పాత్ర పోషిస్తున్నారు: పల్లె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దుర్యోధనుడిలా వ్యవహరిస్తుంటే గవర్నర్ నరసింహన్ ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో గవర్నర్లుగా పనిచేసిన రామ్‌లాల్, ఎన్‌డీ తివారీలకు పట్టిన గతే నరసింహన్‌కు పడుతుందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను చూస్తే తనకు మాయల ఫకీరు గుర్తుకొస్తున్నాడని ఎద్దేవా చేశారు.
ఆయన ఆంతర్యమేమిటో: మంత్రి రావెల
గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ సాష్టాంగ ప్రణామం చేయడంలో ఆంతర్యం ఏమిటో బయట పెట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు డిమాండ్ చేశారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని కోరారు.