TRS CM KCR
-
కార్పొరేట్లకు కేసీఆర్ ఊడిగం
తమ్మినేని వీరభద్రం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్న చందంగా ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలకు హాజరైన తమ్మినేని శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ కేసీఆర్ అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా తెలంగాణ బాగుకు, అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడదు. చేసిన అభివృద్ధి కంటే చెప్పుకున్నదే ఎక్కువ. వెనకబడిన వర్గాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది. కానీ కార్పొరేట్లకు కాంట్రాక్టులు కట్టబెట్టడం, కుటుంబ రాజకీయాలు సుస్థిరం చేసుకోవడం, ఇతర పార్టీల్లోని కాంట్రాక్టర్లు, సంపన్నులను పార్టీలో చేర్చుకోవడం, ప్రతిపక్షం లేకుండా చేసుకోవడం వంటి అంశాలపైనే కేసీఆర్ దృష్టి సారించారు’’ అని దుయ్యబట్టారు. కేంద్ర కమిటీ భేటీలో టీఆర్ఎస్ రెండేళ్ల పాలన, తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించామని, ఆయా అంశాలపై కేంద్ర కమిటీకి నివేదిక కూడా ఇచ్చామన్నారు. -
గవర్నర్ ధృతరాష్ర్టుడి పాత్ర పోషిస్తున్నారు: పల్లె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దుర్యోధనుడిలా వ్యవహరిస్తుంటే గవర్నర్ నరసింహన్ ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో గవర్నర్లుగా పనిచేసిన రామ్‌లాల్, ఎన్డీ తివారీలకు పట్టిన గతే నరసింహన్‌కు పడుతుందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను చూస్తే తనకు మాయల ఫకీరు గుర్తుకొస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన ఆంతర్యమేమిటో: మంత్రి రావెల గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ సాష్టాంగ ప్రణామం చేయడంలో ఆంతర్యం ఏమిటో బయట పెట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు డిమాండ్ చేశారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని కోరారు. -
ఇక్కడ లేని గొడవలు బాబు సృష్టిస్తున్నారు
-
ఇక్కడ లేని గొడవలు బాబు సృష్టిస్తున్నారు
శాంతిభద్రతలపై కేసీఆర్‌కు కృతజ్ఞతలు :సీఆర్ సాక్షి, హైదరాబాద్: ఏడాది కాలంగా హైదరాబాద్‌లో ఎలాంటి శాంతిభద్రత సమస్యా తలెత్తలేదని, ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న కారణంగా ఏపీ సీఎం చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య కొత్త సమస్యలు తెస్తున్నారని కాంగ్రెస్ నేత, శాసనమండలి విపక్ష నేత సీ రామచంద్రయ్య విమర్శించారు. హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం ఉందని, అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఓటుకు కోట్లు కేసులో కూరుకుపోయిన చంద్రబాబు రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను రెచ్చగొడుతూ గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇందిరాభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు సెక్షన్ 8 అమలు గురించి మాట్లాడటంలో ఉద్దేశం ఏమిటన్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామంటూ సీఎం దిగజారి మాట్లాడుతున్నారన్నారు. -
పీయూష్ ఎందుకొచ్చారు?
చర్చనీయాంశమైన కేంద్ర మంత్రి ఆకస్మిక పర్యటన ♦ బీజేపీ రాష్ర్ట కార్యాలయానికీ సమాచారమివ్వని పీయూష్ ♦ ఉదయం చంద్రబాబు, మధ్యాహ్నం కేసీఆర్‌తో భేటీ ♦ ఇద్దరు సీఎంలతో సుదీర్ఘ చర్చలపై సర్వత్రా విస్మయం ♦ రేవంత్ కేసులో బాబు తరఫున మధ్యవర్తిత్వమా? సాక్షి, హైదరాబాద్: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆకస్మిక పర్యటన రాష్ర్టంలో చర్చనీయాంశమైంది. ఆయన హైదరాబాద్ రావడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ రాష్ర్ట కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా ఆయన రాష్ట్రానికి రావడం ఆ పార్టీ నేతలనే విస్తుగొలిపింది. గురువారం ఉదయం వచ్చిన గోయల్.. ఏపీ సీఎం చంద్రబాబుతో అల్పాహార విందులో పాల్గొని సమావేశమయ్యారు. అలాగే మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భోజన విరామ సమయంలో చర్చలు జరిపారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షల లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టు కావడం, దానికి సూత్రధారి చంద్రబాబేనంటూ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో చంద్రబాబును విచారించేందుకు అవినీతి నిరోధక శాఖ నోటీసులు జారీ చేయనుందన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలతో గోయల్ భేటీ చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య రాజీ కుదుర్చడానికే ఆయన వచ్చి ఉంటారని బీజేపీలో జోరుగా ప్రచారం జరిగింది. బాబు తరఫున మధ్యవర్తిత్వం? రేవంత్ ముడుపుల కేసులో చంద్రబాబుపై ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఏసీబీ విచారించబోతున్నదని ప్రచారం జరిగిన 24 గంటల్లోనే పీయూష్ రాష్ట్రానికి రావడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు వ్యవహారంలో మధ్యవర్తిత్వం నెరపడానికే ఆయన వచ్చారేమోనని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య అనుమానం వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి పర్యటన అనుమానాస్పదంగా ఉందని సీపీఎం వ్యాఖ్యానించింది. గోయల్.. మధ్యాహ్నం కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్లి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. రేవంత్ కేసును ప్రస్తావించి చంద్రబాబు వ్యవహారాన్ని కేసీఆర్ ముందు పెట్టినట్లు సమాచారం. బాబును గోయల్ వెనకేసుకురావడం పట్ల ఒక దశలో కేసీఆర్.. బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తినట్లు తెలిసింది. గోద్రా అల్లర్ల సమయంలో మోదీ హైదరాబాద్ వస్తే అరెస్టు చేస్తామన్న చంద్రబాబును వెనకేసుకువస్తున్నారని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఎవరు పంపి ఉంటారు... పీయూష్ గోయల్‌ను హైదరాబాద్‌కు ఎవరు పంపించారన్న దానిపైనా చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు సన్నిహితుడైన ఓ కేంద్ర మంత్రి ఈ వ్యవహారంలో తలదూర్చి గోయల్‌ను పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, సాధారణంగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు వచ్చే ముందు రాష్ట్ర కార్యాలయానికి సమాచారమిస్తారు. అయితే, గోయల్ తన పర్యటన సమాచారాన్ని తెలపలేదు. మధ్యవర్తిగా రాలేదు: రేవంత్ కేసులో సీఎం కేసీఆర్‌తో మాట్లాడటానికి తాను మధ్యవర్తిగా రాలేదని గోయల్ వివరణ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిగా స్థానిక అంశంపై మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు. విద్యుత్ అంశాలపైనే సీఎంలతో చర్చించినట్లు తెలిపారు.