'వీధి రౌడీలా వ్యవహరిస్తున్న కేసీఆర్'
కర్నూలు: కేసీఆర్ తన పదవికి తగినట్టు ప్రవర్తించకుండా వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఏపీ సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని అన్నారు. కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ అని గుర్తుచేశారు.
గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మైనారిటీల ఆస్తులు కబ్జాకు గురైయ్యాయని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి జీవో 18 అమలు చేశామని తెలిపారు. చంద్రబాబు చేతుల మీదుగా మే7న హెల్త్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్టు ప్రకటించారు.