మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 2008వ సంవత్సరం నుంచి పలు పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం చేసిన భూముల కేటాయింపులన్నీ రద్దు చేయాలంటూ.. అవినీతి నిరోధంపై ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం రాష్ట్ర మంత్రివర్గానికి సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఉపసంఘం బుధవా రం హైదరాబాద్‌లోని సచివాలయంలో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను రఘునాథరెడ్డి వెల్లడించారు.
వాన్‌పిక్ ప్రాజెక్టుకు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కేటాయించిన 18,878 ఎకరాలు కేటాయించేందుకు ఒప్పందం జరిగిందని.. అందులో 6,608 ఎకరాలు అప్పగించారని ఆ ఎంఓయూ, కేటాయింపులన్నీ రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. అప్పగించిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,840 ఎకరాలు కేటాయించారని, ఇందులోపెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి తెలిపారు.
సర్వీసు చార్జీ 15 శాతం వసూలు చేయాల్సి ఉండగా, 2 శాతం మాత్రమే వసూలు చేశారని, ప్రభుత్వానికి రావాల్సిన రూ. 15.19 కోట్ల సొమ్ము ఎగ్గొట్టారని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చిలకూరు మండలంలో కినెటా పవర్ ప్రైవేటు లిమిటెడ్‌కు వపర్ ప్రాజెక్టుకు కేటాయించిన 814.77 స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
గతంలో పరిశ్రమలకు చేసిన భూ కేటాయింపులన్నీ రద్దు
Published Thu, Nov 20 2014 1:30 AM | Last Updated on Wed, Aug 29 2018 7:39 PM
Advertisement