Allocation of land
-
అయోధ్య తీర్పు: వారికి 5 ఎకరాలు ఎలా ఇస్తారు?
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ జన్మభూమి- బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సోమవారం హిందూ మహాసభ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ 7 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం కోర్టులో ముస్లింలు ఇప్పటివరకూ 6 రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. హిందువుల నుంచి తొలి రివ్యూ పిటిషన్ దాఖలైంది. ముస్లింలకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హిందూ మహాసభ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా డిసెంబర్ 2న తొలి రివ్యూ పిటిషన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని జామియత్ ఉలామా-ఏ-హింద్‌కు అధ్యక్షుడైన సయ్యద్ అష్షద్ రషీదీ దాఖలు చేశారు. రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిరం నిర్మాణం జరగాలని, ప్రతిగా ముస్లింలకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని నవంబర్ 9న సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
‘దిల్’ భూములు వెనక్కి!
వీటి విలువ రూ.3 వేల కోట్లపైనే.. నిరుపయోగంగా ఉన్న భూ కేటాయింపులు రద్దు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్) సంస్థకు కట్టబెట్టిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రంగారెడ్డి జిల్లాలో ఆ సంస్థకు ధారాదత్తం చేసిన 541.27 ఎకరాలకు సంబంధించిన కేటాయింపులను రద్దు చేసింది. ఈ భూముల విలువ దాదాపు రూ.3 వేల కోట్లపైనే ఉంటుం దని అంచనా.రాజధాని శివార్లలోని రాజేంద్రనగర్, బాలానగర్, కుత్బుల్లాపూర్, మొయినాబాద్, శంషాబాద్, కీసర, ఘట్కేసర్, శంకర్పల్లి, మల్కాజిగిరి, సరూర్‌నగర్, మేడ్చల్‌లలో ఆ సంస్థకు కట్టబెట్టిన భూములను స్వాధీనం చేసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అల్పాదాయవర్గాలకు సొంతింటి భాగ్యం కలిగించేందుకు... వివిధ సంస్థలకు భూములను కేటాయించేందుకు గత ప్రభుత్వం ‘దిల్’ను ఏర్పాటు చేసింది. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో వేల ఎకరాల భూనిధి (ల్యాం డ్ బ్యాంక్)ని ఆ సంస్థకు కట్టబెట్టింది. ఈ సంస్థ నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో చతికిలపడింది. దీనికితోడు రియల్ఎస్టేట్ రంగం కుదేలు కావడం.. రాష్ట్రంలో రాజ కీయ అనిశ్చితి నెలకొనడంతో దిల్ కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆ సంస్థ అట్టిపెట్టుకున్న భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర సర్కారు నిర్ణ యం తీసుకుంది. నిరుపయోగ భూములపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద సర్వే నిర్వహించింది. జిల్లావ్యాప్తంగా నాలుగు ఎకరాలను మాత్రమే ఆ సంస్థ వినియోగంలోకి తెచ్చిందని గుర్తించింది. జిల్లాలో దిల్‌కు 2,084.19 ఎకరాలను కేటాయించారు. దీంట్లో నాలుగు ఎకరాలు మాత్రమే వినియోగించుకున్నట్లు తేల్చింది. నూతన పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వెల్లువలా వస్తాయని భావిస్తున్న సర్కారు... వాటి స్థాపనకు తగినంత ల్యాండ్‌బ్యాంక్‌ను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. దశలవారీగా మిగతా భూ కేటాయింపులను రద్దు చేయనున్నట్లు తెలిసింది. -
లెక్కాపత్రం లేదు!
రికార్డులు నిర్వహించని ఫలితం ఇచ్చింది 18,700 ఎకరాలంటున్న అధికారుల 14,099 ఎకరాలే అని చెబుతున్న సంస్థలు తేలని 4,601ఎకరాల లెక్కలు మిగులు’ భూముల అన్వేషణలోబయటపడిన బండారం సర్కారు భూముల లెక్క తప్పింది. పారిశ్రామిక, ప్రజావసరాల కోసం వివిధ ఏజెన్సీల (ప్రభుత్వ విభాగాలు)కు బదలాయించిన స్థలాలకు రెక్కలొచ్చాయి. భూ కేటాయింపుల రికార్డులను సరిగా నమోదు చేయకపోవడంతో జిల్లాలో 4,601 ఎకరాల భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. హెచ్ఎండీఏ, టీఐఐసీ, దిల్, రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప, హౌసింగ్ బోర్డు తదితర సంస్థలకు 18,700 ఎకరాలు కేటాయించినట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తుండగా.. తమకు 14,099 ఎకరాలు మాత్రమే బదలాయించినట్లు ఆయా సంస్థలు బుకాయిస్తుండడం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సాఫ్ట్వేర్ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు, పరిశ్రమల స్థాపనకు మౌలిక సదుపాయాలను కల్పించే టీఐఐసీ, హెచ్ఎండీఏలకు కొన్నేళ్లుగా ప్రభుత్వం భూములను కట్టబెడుతోంది. ఈ విభాగాలు ఆయా సంస్థల అవసరాలను పరిగణనలోకి తీసుకొని భూ కేటాయింపులు జరుపుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులు అందడమే తరువాయి.. ఆగమేఘాల మీద భూములను అప్పగిస్తున్న జిల్లా యంత్రాంగం.. వాటి రికార్డుల నిర్వహణలో కొంత నిర్లక్ష్యం వహించింది. అంతేకాకుండా ఆ సంస్థలకు స్వాధీనం చేసిన భూమి.. నిర్ధేశిత అవ సరాలకు వినియోగిస్తున్నారా? ఎంత మేర కేటాయించారనే అంశాన్ని విస్మరిస్తోంది. దీంతో ఇటు జిల్లా యంత్రాంగం.. అటు హెచ్ఎండీఏ, టీఐఐసీ, టీహెచ్బీ తదితర సంస్థలకు జరిపిన భూ కేటాయింపులకు సంబంధించిన సమాచారంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పగ్గాలు చేపట్టిన కేసీఆర్ సర్కారు.. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల వివరాలను సేకరించాలని ఆదేశించింది. ఆయా శాఖలకు కేటాయించిన భూములు, వినియోగంలోకి రాగా, మిగులు భూమి ఎంత ఉందనే సమాచారాన్ని నివేదించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన రెవెన్యూ యంత్రాంగం భూ కేటాయింపులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేసింది. పాత రికార్డుల దుమ్ము దులిపిన అధికారగణం.. జిల్లా వ్యాప్తంగా 18,700 ఎకరాల మేర భూమి ఆయా శాఖలకు బదలాయించినట్లు లెక్క తేల్చింది. అదే సమయంలో సంబంధిత శాఖల నుంచి సమాచారాన్ని కోరింది. ఈ మేరకు ఆయా శాఖలు పంపిన నివేదికతో జిల్లా యంత్రాంగం దిమ్మతిరిగింది. కేటాయించిన భూమికి.. ఆయా శాఖలు తేల్చిన లెక్కకు పొంతన కుదరకపోవడంతో గందరగోళంలో పడింది. ఏకంగా 4,601 ఎకరాల మేర తేడా రావడం... ఎన్నిసార్లు లేఖలు రాసినా సంబంధిత విభాగాలు స్పందించకపోవడం మిన్నకుండిపోయింది. హెచ్ఎండీఏదే పెద్ద వాటా! నగరీకరణను ఆసరా చేసుకొని స్థిరాస్తి వ్యాపారాన్ని చేసిన హెచ్ఎండీఏ అప్పనంగా భూములను సేకరించింది. నగర శివార్లలో 6,105 ఎకరాలు సేకరించిన సదరు సంస్థ తమకు కేవలం 3,353 ఎకరాలు మాత్రమే కేటాయించారని బుకాయిస్తోంది. అలాగే పారిశ్రామిక అవసరాలను పర్యవేక్షించే టీఐఐసీ కూడా భూముల లెక్కలను తప్పుగా చూపింది. ఆ సంస్థ తీసుకున్న భూమి 8,682 ఎకరాలని జిల్లా యంత్రాంగం వాదిస్తుండగా, టీఐఐసీ మాత్రం 7,032 ఎకరాలు మాత్రమేనని ఢంకా బజాయిస్తోంది. దిల్, తెలంగాణ హౌసింగ్‌బోర్డు, రాజీవ్ గృహకల్ప భూ కేటాయింపుల్లో కూడా సామీప్యత లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఆయా సంస్థలు అట్టిపెట్టుకున్నట్లు గుర్తించిన స్థలాల సమాచారంలోనూ తేడా కనిపిస్తోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 10,396 ఎకరాల మేర సదరు సంస్థల వద్ద మిగులు భూములు ఉన్నట్లు తేల్చగా, సంస్థలు మాత్రం 6,624 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు నివేదిక సమర్పించింది. -
తకరారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పారిశ్రామిక విధానం ఖరారు కావడంతో భూముల అన్వేషణపై సర్కారు దృష్టి సారించింది. ఈ క్రమంలో జిల్లాలో భూముల లెక్కలు తిరగేస్తూ.. కొత్త కేటాయింపులపై యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ శాఖలు/ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూముల లెక్కలు తేల్చడంలో తలమునకలైంది. పెట్టుబడులకు రెడ్‌కార్పెట్ పరచాలని భావిస్తున్న కేసీఆర్ సర్కారు.. ఖాళీ భూములపై ఆరా తీస్తోంది. వీలైనంత మేరకు వివాదరహిత భూములను కేటాయించడం ద్వారా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవాలని భావిస్తోంది. భూ కేటాయింపులేగాకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, వాటిలో వెలసిన ఆక్రమణలను కూడా గణిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జిల్లాలో 39వేల ఎకరాల మేర ల్యాండ్ బ్యాంక్ ఉందని జిల్లా యంత్రాంగం తేల్చింది. ఇవి తక్షణ కేటాయింపులు అనువుగా ఉన్నాయని గుర్తించింది. ఇదిలావుండగా, ఖాళీ స్థలాల గుర్తింపు అధికారగణానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. రోజుకో లెక్క తేలుతుండడంతో స్పష్టమైన వివరాలను రాబట్టడం యంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది. హెచ్ఎండీఏ, టీఐఐసీలు ప్రభుత్వ భూములను నేరుగా ఆయా కంపెనీలకు బదలాయించడం, ఎవరెవరికి, ఎంత మేర కట్టబెట్టారనే సమాచారం జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఇవ్వకపోవడం ఈ గందరగోళానికి కారణమవుతోంది. 39,443 ఎకరాలు కేటాయింపు! జిల్లాలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలకు గత ప్రభుత్వాలు 39,443 ఎకరాలను కేటాయించాయి. దీంట్లో ప్రభుత్వ శాఖలకే 18,700 ఎకరాలను బదలాయించారు. వీటిలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ), రాజీవ్ స్వగృహ, దిల్, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఐఐసీ), తెలంగాణ హౌసింగ్ బోర్డు (టీహెచ్బీ) తదితర సంస్థలకు కట్టబెట్టారు. దీంట్లో సుమారు సగం విస్తీర్ణం ఇంకా వినియోగంలోకి రాలేదని రెవెన్యూ యంత్రాంగం సర్వేలో తేల్చింది. పరిశ్రమలు స్థాపించని సంస్థల నుంచి స్వాధీనం చేసుకోవడమేగాకుండా.. పారిశ్రామిక అవసరాలు పోను అట్టిపెట్టుకున్న మిగతా స్థలాలను కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ద క్కన్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్(దిల్) సంస్థ అయితే ఏకంగా భూమిని తనఖా పెట్టి రుణాలు తీసుకుంది. భూ యాజమాన్య హక్కులు రానప్పటికీ, భూమిని కుదువపెట్టి రుణం తీసుకోవడంతో ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోలేని పరిస్థితి తలెత్తింది. కొన్ని సంస్థలు అత్యాశకు పోయి.. భూ సేకరణాస్త్రంతో అడ్డగోలుగా భూములను తీసుకున్నాయి. ఈ భూములను అట్టిపెట్టుకోవడమో... అవసరాలకు మించి సంస్థలకు కట్టబెట్టడమో చేశాయి. దీంతో విలువైన భూములు ఆయా సంస్థల గుప్పిట్లోకి వెళ్లాయి. ఇలా ఆయా సంస్థలు నిరుపయోగంగా ఉంచుకున్న భూములు, వినియోగంలోకి రాని భూముల వివరాలను రాబట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ తరహా స్థలాల పై కూడా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అంచనాలను రూపొం దించింది. ప్రభుత్వ విభాగాలకు కేటాయించిన భూమిలో కేవలం 8,304.03 విస్తీర్ణం మాత్రమే వినియోగంలోకి రాగా, 10,396.11 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నట్లు లెక్క తేల్చింది. ఈ భూములను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కేటాయించేందుకు వీలు గా వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్రానికి తరలిరానుండడం, ఫిలింసిటీ, ఫార్మాసిటీ, ఐటీఐఆర్, కెమికల్ సిటీ పేర పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడమే కాకుండా.. దానికి అనుగుణంగా ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేయాలని ఆదేశించడంతో ఖాళీ భూములపై జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. పరిశ్రమలకు భూముల నోటిఫై! పరిశ్రమలకు కేటాయించే భూములను ప్రత్యేకంగా నోటిఫై చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఆయా సంస్థలకు నిర్ధేశించిన భూములను మాత్రమే కేటాయించేందుకు ఈ కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భూముల లెక్క తీస్తు న్న సర్కారు... పరిశ్రమల స్థాపనకు అనువైన భూముల జాబితా రూపొం దించింది. జిల్లాలో బల్క్‌డ్రగ్, ఫార్మాసిటీ తదితర పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ల్యాండ్ బ్యాం కును సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాడలకు గుర్తించిన భూములను నోటిఫై చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ శ్రీధర్‌ను ఆదేశించారు. ఫార్మాసిటీ, ఏరోస్పేస్ సిటీ, పరిశ్రమల స్థాపనకు రంగారెడ్డి జిల్లా అనువైన ప్రాంతమని సీఎం చెప్పారు. ఇందుకోసం 30 వేల ఎకరాల మేర రిజర్వ చేయాలని ఆయన ఆదేశించారు. -
గతంలో పరిశ్రమలకు చేసిన భూ కేటాయింపులన్నీ రద్దు
మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 2008వ సంవత్సరం నుంచి పలు పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం చేసిన భూముల కేటాయింపులన్నీ రద్దు చేయాలంటూ.. అవినీతి నిరోధంపై ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం రాష్ట్ర మంత్రివర్గానికి సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఉపసంఘం బుధవా రం హైదరాబాద్‌లోని సచివాలయంలో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను రఘునాథరెడ్డి వెల్లడించారు. వాన్‌పిక్ ప్రాజెక్టుకు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కేటాయించిన 18,878 ఎకరాలు కేటాయించేందుకు ఒప్పందం జరిగిందని.. అందులో 6,608 ఎకరాలు అప్పగించారని ఆ ఎంఓయూ, కేటాయింపులన్నీ రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. అప్పగించిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,840 ఎకరాలు కేటాయించారని, ఇందులోపెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి తెలిపారు. సర్వీసు చార్జీ 15 శాతం వసూలు చేయాల్సి ఉండగా, 2 శాతం మాత్రమే వసూలు చేశారని, ప్రభుత్వానికి రావాల్సిన రూ. 15.19 కోట్ల సొమ్ము ఎగ్గొట్టారని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చిలకూరు మండలంలో కినెటా పవర్ ప్రైవేటు లిమిటెడ్‌కు వపర్ ప్రాజెక్టుకు కేటాయించిన 814.77 స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.