మంత్రి కోసం రైలు ఎదురుచూపు! | train waits half an hour for minister palle raghunatha reddy | Sakshi
Sakshi News home page

మంత్రి కోసం రైలు ఎదురుచూపు!

Published Tue, Jan 27 2015 8:12 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

మంత్రి కోసం రైలు ఎదురుచూపు!

మంత్రి కోసం రైలు ఎదురుచూపు!

ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోసం బెంగళూరు నుంచి విశాఖపట్టణం వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలును కర్నూలు జిల్లా నంద్యాలలో సుమారు అరగంట సేపు ఆపేశారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల ఎన్‌జీఓ కాలనీలోని సాయి గురురాఘవేంద్ర సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించడానికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి రావాల్సి ఉంది.

ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నుంచి బయలుదేరారు. కాని తమను ఆహ్వానించకుండా నిర్వహిస్తున్న వేడుకలకు మంత్రి హాజరు కావడం సరికాదని స్థానిక టీడీపీ నేత అధిష్ఠానానికి ఫిర్యాదు చేశాడు. దీంతో తాను ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు వెళ్తానని స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారాన్ని అందించారు. వారు హుటాహుటిన రైల్వే స్టేషన్ చేరుకుని రైలును అరగంటపాటు ఆపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement