హైదరాబాద్: సమాచారశాఖను ప్రక్షాళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్లో పల్లె రఘునాథరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ...అధికారులు తమ విధుల పట్ల బాధ్యతారహితంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఏపీలో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో ప్రారంభిస్తారని పల్లె రఘునాథరెడ్డి చెప్పారు.