తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని మండిపడ్డారు. 'కేటీఆర్ సంస్కారం నేర్చుకో. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. చంద్రబాబును విమర్శించే స్థాయి నీకు లేదు. మీ నాన్నను ఆదర్శంగా తీసుకోవద్దు' అంటూ కేటీఆర్ ను పల్లె ఎద్దేవా చేశారు.