అధ్యాపకురాలి వేధింపులే కారణమని సూసైడ్ నోట్!
అనంతపురం సెంట్రల్: రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కళాశాలలో వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాసినా పోలీసులు విషయం బయటపడకుండా తొక్కిపట్టారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం వీరన్నపల్లికి చెందిన గోపాల్, లక్ష్మిదేవి దంపతుల కుమార్తె మాధవీలత మంత్రికి చెందిన పీవీకేకే కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతోంది.
సోమవారం సాయంత్రం కళాశాల ముగించుకుని అనంతపురం అరవింద్‌నగర్‌లోని బీసీ హాస్టల్‌కు వెళ్లగానే విషపు ద్రావకం తాగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. సోమవారం సాయంత్రమే ఈ ఘటన జరిగినా కళాశాల యాజమాన్యం, పోలీసులు తొక్కిపెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి పల్లె కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
Published Wed, Mar 1 2017 3:20 AM | Last Updated on Tue, Nov 6 2018 8:22 PM
Advertisement
Advertisement