pvkk college
-
జగనన్న కాలనీల్లోనే మహిళలకు ఉపాధి
రాప్తాడురూరల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో నివాసాలు ఉండే మహిళలకు గార్మెంట్స్ పరిశ్రమల ద్వారా స్థానికంగానే ఉపాధి కల్పిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే ఇప్పటికే పలుమార్లు తమిళనాడు, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలకు వెళ్లి కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. వారిని స్వయంగా పిలిపించి ఇక్కడి ప్రదేశాలను చూపించారు. తాజాగా ఎమ్మెల్యే చొరవతో తిర్పూర్‌కు చెందిన బెస్ట్ ఇంటర్నేషనల్ గార్మెంట్స్ చైర్మన్ ఎస్.రామస్వామి, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.రాజ్‌కుమార్, సీఈఓ గౌతంరెడ్డి శుక్రవారం ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చారు. అనంతపురం మండలం ఆలమూరు సమీపంలోని పీవీకేకే కళాశాల వద్ద హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తదితరులు బొకేలు అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి వాహనంలో ఆలమూరు జగనన్న కాలనీకి చేరుకుని పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేదల కోసం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో నివాసాలు ఉండే మహిళలకు స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉదయం, రాత్రి రెండు షిఫ్టులూ పరిశ్రమలు నడిపేందుకు అనుకూలంగా ఉంటాయని యజమానులు భావిస్తున్నట్లు చెప్పారు. కారి్మకుల రవాణా కోసం బస్సు సదుపాయం కూడా కలి్పంచేలా చర్యలు తీసుకుంటారన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే తమిళనాడు, జైపూర్ నుంచి అనేకమంది వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. గార్మెంట్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ మంచి వాతావరణం ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. వారివెంట రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ బెడదూరి గోపాల్‌రెడ్డి, మాజీ చైర్మన్ తాటిచెర్ల నాగేశ్వరెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, అనంతపురం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పవన్‌కుమార్, నాయకులు వడ్డే శీనా, ఉప్పరపల్లి సర్పంచ్ సావిత్రి శ్రీనివాసులు, కక్కలపల్లి సర్పంచ్ గార్లదిన్నె కృష్ణయ్య, నాయకులు ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు. పరిశ్రమలతోనే రాష్ట్రాభివృద్ధి రాప్తాడు: పరిశ్రమల ఏర్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో పరిశ్రమల కోసం సేకరించిన భూములను శుక్రవారం బెస్ట్ ఇంటర్నేషనల్ గార్మెంట్స్ చైర్మన్ రామస్వామి, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.రాజ్‌కుమార్, సీఈఓ గౌతంరెడ్డి, రామ్ రాజ్ కాటన్ సంస్థ ప్రతినిధి సుందరమూర్తితో కలిసి వారు పరిశీలించారు. సమీపంలోని జగనన్న లేఅవుట్, టిడ్కో ఇళ్లను పరిశీలించారు. (చదవండి: నువ్వా నేనా..అనంత అసెంబ్లీ టెక్కెట్ దక్కేదెవరికో..?) -
పీవీకేకేలో ఘనంగా యువజన దినోత్సవం
అనంతపురం రూరల్: పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులను బహుమతులు ప్రదానం చేశారు. యువజనోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులు రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేఎన్టీయూ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ నేటి యువత వ్యసనాల బారిన పడి సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు. అలాకుండా దేశ నిర్మాణానికి తమ వంతు తోడ్పాటును అందించాలన్నారు. యువజన సంక్షేమాధికారి వెంకటేశం మాట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు యువత ధైర్యంగా ఎదుర్కొవాలే తప్ప కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడడం తప్పన్నారు. అంతకు మునుపు రుద్రంపేట సర్కిల్ నుంచి 2కే రన్‌ను నగర మేయర్ స్వరుపా ప్రారంభించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున రన్లో ఉత్సహంగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్‌రెడ్డి, విశ్రాంత అదనపు ఎస్పీలు రజాక్, సత్యనారాయణ, శ్రీకాంత్‌రెడ్డి, ధనుంజయతో పాటు పలువురు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమోదం!
మృత్యువుకు ఆహ్వానం - అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండానే నిర్మాణాలు - ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి - దాడులు నిర్వహించని అధికారులు - ప్రభుత్వ శాఖల మధ్య కొరవడిన సమన్వయం - నిర్మాణాల సమాచారం లేని అగ్నిమాపక శాఖ - గతనెల 25న ఆలమూరు రోడ్డులో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన బాలాజీ కళాశాలలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వంద కంప్యూటర్లు, ఏసీలు దగ్ధమయ్యాయి. - గత నెల 24న మారుతీనగర్‌లోని శ్రీచైతన్య స్కూల్ రెండవ అంతస్తులో షార్టు సర్క్యూట్ జరిగింది. వెంటనే విద్యార్థులను బయటకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. - ఈ రెండు యాజమాన్యాలు తొలుత ఫైర్‌సేఫ్టీ అనుమతి పొందినా రెన్యూవల్ చేసుకోకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది. అగ్నిమాపక శాఖ అనుమతులు ఇలా.. సంస్థ మొత్తం అనుమతి సినిమాల్స్ 75 28 ఫంక్షన్‌హాల్స్ 330 3 హాస్పటల్స్ 434 46 ప్రై వేటు స్కూల్స్ 1350 828 కోల్డ్ స్టోరేజస్ 11 1 పరిశ్రమలు 198 22 అనంతపురం సెంట్రల్: బహుల అంతస్తుల భవనాలు.. సినిమా హాళ్లు.. స్కూళ్లు.. హాస్పిటళ్ల నిర్మాణం చూస్తే కళ్లు చెదరాల్సిందే. బయటకు చూడచక్కగా కనిపించే వీటిలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంటే బయటపడటం కష్టమే. ఎందుకంటే.. అధిక శాతం నిర్మాణాల్లో అగ్నిమాపక శాఖ నిబంధనలను పాటిస్తున్న దాఖలాల్లేవు. కొందరు అనుమతి తీసుకుంటున్నా.. ఆ తర్వాత రెన్యూవల్ చేసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. చిన్న ప్రమాదం జరిగినా నియంత్రించే సామగ్రి లేకపోవడంతో ప్రజల ప్రాణం గాలిలో దీపంగా మారుతోంది. లక్షలాది రూపాయలతో వ్యాపారం చేస్తున్నా.. కనీస ప్రమాణాలను విస్మరించడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదానికి దారి తీస్తుందోననే చర్చ జరుగుతోంది. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలల్లో కూడా ప్రమాదాలను నివారించే ఏర్పాట్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గుడ్లప్పగించి చూస్తున్న అగ్నిమాపకశాఖ జిల్లాలో ఎలాంటి అనుమతుల్లేని నిర్మాణాల విషయంలో అగ్నిమాపక శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సంస్థలపై ఎలాంటి దాడులు నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సి ఉండటంతో అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోకుండానే యథేచ్ఛగా నిర్మాణాలు సాగిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఇటీవల శ్రీచైతన్య స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాన్ని పరిశీలిస్తే.. యాజమాన్యం పిల్లల భవిష్యత్తుతో ఎలా చెలగాటం ఆడుతుందో అర్థమవుతోంది. సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినా.. అగ్నిమాపక శాఖ అధికారులు ఇప్పటికీ పట్టించుకోకపోవడం వెనుక ముడుపుల వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పై అంస్తుల నుంచి దిగేందుకు ఒకే మెట్ల మార్గం ఉంది. ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటే పిల్లల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకమవుతోంది. జిల్లాలోని చాలా వరకు ప్రయివేట్ స్కూళ్లు.. కార్పొరేట్, ప్రయివేట్ హాస్పిటళ్లు ఫైర్‌సేఫ్టీ అనుమతి తీసుకోకపోయినా అధికారులు దాడులు నిర్వహించకపోవడం గమనార్హం. ఏటా ఏప్రిల్ 14 నుంచి వారం రోజుల పాటు అగ్నిమాపక శాఖ వారోత్సవాల పేరిట హడావుడి చేయడం తప్పిస్తే.. నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నకు సమాధానం కరువయింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలేమి అగ్నిమాపకశాఖతో మిగిలిన ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. అనుమతులు ఇచ్చేటప్పుడు అగ్నిమాపకశాఖ నిబంధనలు పాటిస్తున్నారా? అనుమతి పొందారా అనే వివరాలు తెలుసుకోవట్లేదు. భవంతులు, ప్రైవేటు స్కూళ్లు, హాస్పటళ్లలో ఫైర్‌సేఫ్టీ పాటించకపోయినా ఆ శాఖల అధికారులు అనుమతులు ఇస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఎన్ని ప్రైవేటు స్కూళ్లు, హాస్పిటళ్లు, సినిమా హాళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉన్నాయనే సమాచారం కూడా అగ్నిమాపక శాఖ వద్ద లేకపోవడం గమనార్హం. అనేకమార్లు ఆయా శాఖల అధికారులకు లేఖలు పంపినా స్పందన కరువయిందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అగ్నిమాపశాఖ అధికారుల వద్దకు వచ్చిన వారికి మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. తక్కిన సమయాల్లో అధికారులు తనిఖీలు చేయడం.. కేసులు నమోదు చేయకపోవడంతో భవంతులు మృత్యువుకు ఆహ్వానం పలుకుతున్నాయి. చర్యలు తప్పవు జిల్లాలో అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోని సంస్థలను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నాం. జన సందోహం ఉండే ప్రతి ఒక్క హాస్పిటల్, స్కూల్, సినిమా హాల్, పరిశ్రమలు తప్పనిసరిగా అనుమతి పొందాలి. లేకపోతే చర్యలు తప్పవు. - కె.సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి. -
9న క్యాంపస్ ఇంటర్వ్యూలు
అనంతపురం రూరల్ : పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 9న ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అసెంచర్ క్యాంపస్ ఇంటర్వ్యూలు చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. బీటెక్, డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. ఇతర కళాశాలల విద్యార్థులు కూడా హాజరుకావచ్చునని పేర్కొన్నారు. -
మంత్రి పల్లె కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
అధ్యాపకురాలి వేధింపులే కారణమని సూసైడ్ నోట్! అనంతపురం సెంట్రల్: రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కళాశాలలో వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాసినా పోలీసులు విషయం బయటపడకుండా తొక్కిపట్టారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం వీరన్నపల్లికి చెందిన గోపాల్, లక్ష్మిదేవి దంపతుల కుమార్తె మాధవీలత మంత్రికి చెందిన పీవీకేకే కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతోంది. సోమవారం సాయంత్రం కళాశాల ముగించుకుని అనంతపురం అరవింద్‌నగర్‌లోని బీసీ హాస్టల్‌కు వెళ్లగానే విషపు ద్రావకం తాగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. సోమవారం సాయంత్రమే ఈ ఘటన జరిగినా కళాశాల యాజమాన్యం, పోలీసులు తొక్కిపెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పీవీకేకేలో స్వచ్ఛభారత్
అనంతపురం న్యూసిటీ : పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సంతోష్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీవీకేకే యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, మెకానికల్ విభాగాధిపతి బాలసుబ్రమణ్యం, మెకానికల్ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు. -
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 16 మందికి ఉద్యోగాలు
అనంతపురం న్యూసిటీ : పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం టీబీఎస్ఎస్, ఐకేఎస్, ఎస్ఈఐఎస్, నోవా సొల్యూషన్స్, సిగ్నల్ వైర్ టెలికాం కంపెనీల ప్రతినిధులు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. మౌఖిక, రాత విభాగాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన 16 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారని కళాశాల ప్రిన్సిపల్ సంతోష్‌కుమార్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్లు పి. సుగుణ, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లె సారూ.. ఆదుకోండి!
మంత్రి పల్లె కళాశాలలో పని చేస్తూ గాయపడిన కార్మికుడు కేసు నమోదు చేయకుండా మాయమాటలు చెప్పిన అనుచరులు ఆర్థికసాయం చేస్తామని పట్టించుకోని వైనం న్యాయం చేయాలంటున్న బాధిత కుటుంబ సభ్యులు అనంతపురం మెడికల్ :రాష్ట్ర పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన పీవీకేకే కళాశాలలో పని చేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడి మంచానికే పరిమయ్యాడో యువకుడు. ప్రమాదం జరిగిన సమయంలో అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చి ఆపై పట్టించుకోక పోవడంతో ఆ యువకుడి బాధ వర్ణణాతీతం. బాధితుడు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లిలో నివాసం ఉంటున్న ఓబుళపతి (31) గత ఏడాది ఫిబ్రవరిలో కక్కలపల్లిలోని పీవీకేకే కళాశాలలో రెండో అంతస్తు ఎక్కి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో వెన్నెముక విరిగింది. వెంటనే కళాశాలలోని వారు అతడిని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ క్రమంలో కేసు నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు. అనంతరం ఎంత ఖర్చయినా భరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అనంతలో వెన్నెముకకు సంబంధించి శస్త్ర చికిత్స లేదని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యం అందకపోవడంతో చివరకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎలాంటి ఆర్థికసాయం చేయకపోగా బాధితుడికి రూ.1.50 లక్షల వరకు ఖర్చయింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశాక ఓబుళపతిని అనంతపురం తీసుకొచ్చారు. ఫిజియోథెరపీ చేయించినా ఫలితం లేకపోగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో తల్లి సరోజమ్మ, భార్య స్నేహలత సపర్యలు చేస్తున్నారు. కాగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న బిల్లులను మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఇదివరకే అందజేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత వెళ్లి ఆర్థికసాయం చేయాలని అడిగితే ఆ బిల్లులు తన వద్ద లేవని, మరోసారి ఇవ్వాలని మంత్రి చెబుతున్నట్లు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం బిల్లు డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్‌తో పాటు జిరాక్స్ బిల్లులు మూడు సార్లు ఇచ్చామని, మంత్రి మాత్రం స్పందించడం లేదన్నారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, తమకు నష్టపరిహారం అందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనుకాడమని ఓబుళపతి, ఆయన భార్య స్నేహలత, తల్లి సరోజమ్మ అంటున్నారు. మంత్రి సతీమణి చెప్పడంతోనే తాను పై అంతస్తుకు ఎక్కి పనులు చేశానని, ఈ క్రమంలోనే జారిపడినట్లు ఓబుళపతి తెలిపారు.