
పీవీకేకేలో స్వచ్ఛభారత్
అనంతపురం న్యూసిటీ : పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సంతోష్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీవీకేకే యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, మెకానికల్ విభాగాధిపతి బాలసుబ్రమణ్యం, మెకానికల్ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు.