పీవీకేకేలో ఘనంగా యువజన దినోత్సవం
అనంతపురం రూరల్: పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులను బహుమతులు ప్రదానం చేశారు. యువజనోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులు రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేఎన్‌టీయూ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ నేటి యువత వ్యసనాల బారిన పడి సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు. అలాకుండా దేశ నిర్మాణానికి తమ వంతు తోడ్పాటును అందించాలన్నారు.
యువజన సంక్షేమాధికారి వెంకటేశం మాట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు యువత ధైర్యంగా ఎదుర్కొవాలే తప్ప కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడడం తప్పన్నారు. అంతకు మునుపు రుద్రంపేట సర్కిల్ నుంచి 2కే రన్‌ను నగర మేయర్ స్వరుపా ప్రారంభించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున రన్‌లో ఉత్సహంగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్‌రెడ్డి, విశ్రాంత అదనపు ఎస్పీలు రజాక్, సత్యనారాయణ, శ్రీకాంత్‌రెడ్డి, ధనుంజయతో పాటు పలువురు పాల్గొన్నారు.