కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి.
అనంతపురం: అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి. జడ్పీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
కాగా, విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వరరెడ్డి, చాంద్ బాషా, డీసీసీబీ చైర్మన్ శివశంకరరెడ్డి మద్దతు తెలిపారు.