సాక్షి, తాడేపల్లి: అవాస్తవాలను ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. వృద్దసైకో, పిల్లసైకో, ఇంకొక సైకో గంజాయి తాగి రోడ్డున పడ్డారంటూ ధ్వజమెత్తారు మంత్రి జోగి రమేష్. శనివారం తాడేపల్లి నుంచి ప్రెస్‌మీట్ నిర్వహించిన మంత్రి జోగి రమేష్, ‘లోకేష్ అప్పడంగాడు. ఈ అప్పడం గవర్నర్ ని కలిసి రాష్ట్రంలో గంజాయి ఉందని ఫిర్యాదు చేశాడు. అసలు ఇతనికి ఉన్న అర్హత ఏంటి?, వార్డు సభ్యునిగా కూడా గెలవని వ్యక్తి గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. గంజాయి సాగుని ధ్వంసం చేసి క్లీన్ ఏపీగా సీఎం జగన్ మార్చారు.
అప్పట్లో మీ నాన్న సీఎం గా ఉన్నప్పుడు ఏపీలో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగింది. అప్పటి మీ మంత్రులు గంజాయి వ్యాపారం చేశారు. మాటలేమో కోటలు దాటతాయి, చర్చకు రమ్మంటే పారిపోతారు. భూతాలు, పిశాచాలు, సైతానుల గురించి పురాణాల్లో చెప్పేవారు.ఆ ముగ్గురు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లే, ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందుతుంటే తట్టుకోలేక శాంతిభద్రతల విఘాతం కల్గించాలని చూస్తున్నారు. గంజాయి సరఫరాలో పెద్దపెద్దవారి ఇన్వాల్మెంట్ ఉందని మంత్రులే చెప్పారు.చంద్రబాబు, లోకేష్ పాత్ర ఉందని అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు చెప్పారు. మరి అలాంటిది మా ప్రభుత్వంపై గవర్నర్ కి ఫిర్యాదు చేస్తావా లోకేష్? అంటూ నిలదీశారు.
‘అప్పుడు పవన్ ఐస్‌క్రీమ్ తింటున్నారా’
కాకినాడ: గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు అరాచకాలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఐస్ క్రీమ్ తింటున్నాడా? అని ప్రశ్నించారు మంత్రి సీదిరి అప్పలరాజు. పవన్ కళ్యాణ్‌ది ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ అని, అతనొక రాజకీయ వ్యభిచారి అని సీదిరి మండిపడ్డారు. సచివాలయాల్లో ఎలాంటి సేవలందిస్తారో పవన్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థల మీద పవన్‌కు నమ్మకం లేదన్నారు. పవన్‌ని కూడా పీకే గాడు.. వీపీ గాడు అని తాము కూడా ఏకవచనంతో అనలేమా? అని హెచ్చరించారు మంత్రి సీదిరి.
చదవండి: హిందూ ధర్మం టార్గెటా? బాబూ పవనూ.. ఎక్కడా?.. ఇక్కడో లుక్కేస్కో
Comments
Please login to add a commentAdd a comment