
ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర పేరుతో ఏపీలో తిరుగుతుండటంతోనే రాష్ట్రంలో వర్షాలు కురువడం లేదని ఎద్దేవా చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి. ఒకవైపు లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు ఇటీవ సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కారణంగా వరుణుడు కరుణించడం లేదన్నారు.
ఏపీలో వైఎస్సార్‌సీపీ పాలనలో మొదటి నాలుగేళ్లు బాగా వర్షాలు పడగా, ఇప్పుడు పడటం లేదని గ్రామాల్లో ప్రజలే అనుకుంటున్నారని, దానికి కారణం కూడా లోకేష్, చంద్రబాబులు ఏపీలో పర్యటించడమేనన్నారు. ఆ నాలుగేళ్లు చంద్రబాబు, నారా లోకేష్‌లు హైదరాబాద్‌కే పరిమితం కావడంతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయన్నారు
1999-2004 మధ్య ఆంధ్రప్రదేశ్ కరువుకు కేరాఫ్ అడ్రస్‌లా ఉండేదని, ఆ తర్వాత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పుష్కలంగా వర్షాలు కురిసి, రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు. మళ్ళీ 2014-19 మధ్య అవే పరిస్థితులు నెలకొంటే వైఎస్ సీఎం అయ్యాక మొదటి నాలుగేళ్లు సకాలంలో వర్షాలు కురిశాయన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ ఏపీలో తమ పాదాలు మోపడంతో వారి పాదాల ప్రభావం వల్ల మళ్ళీ వర్షాలు పడడం లేదని, ప్రజలు అభిప్రాయపడుతున్నరనే సంగతిని అవినాష్‌రెడ్డి గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment