ఏలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఆధ్వర్యంలో పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... టీడీపీ - బీజేపీ రెండు నాల్కల ధోరణితో రాష్ట్రం అధోగతిపాలైందని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై సెప్టెంబర్ 22వ తేదీన ఏలూరులో జరిగే వైఎస్ జగన్ యువభేరి సదస్సు విజయవంతం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.