సాక్షి, విశాఖ: చంద్రబాబు కోసం ప్రజలు ఎందుకు రోడ్లు మీదకు వచ్చి నిరసన తెలపాలని ప్రశ్నించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఈరోజు(గురువారం) విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి కారుమూరి.. ‘చంద్రబాబు కోసం బాలయ్య సినిమాను ఎందుకు ఆపలేరు. చంద్రబాబు బాధలో ఉంటే ఎందకు సినిమా రిలీజ్ చేశారు. హెరిటేజ్‌ను ఎందుకు మూయలేదు. హెరిటేజ్‌కు లాభాలు వచ్చాయని ఇప్పటికే సంస్థ ప్రకటించింది.బాబు కోసం హెరిటేజ్ ముయారు, బాలయ్య సినిమాలు ఆపరు. చంద్రబాబు కోసం బాలయ్య సినిమాను ఎందుకు ఆపలేదు?, చంద్రబాబు బాధలో ఉంటే ఎందుకు సినిమా రిలీజ్ చేశారు. హెరిటేజ్‌ను ఎందుకు మూయ్యలేదు. ప్రజలు మాత్రం బాబు కోసం నిరసనలు చేయాలా?, బీసీలు బ్యాక్ వర్డ్ కాదు బ్యాక్ బోని నమ్మిన వ్యక్తి సీఎం జగన్. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్. బీసీల గౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్. లక్ష 11 వేల కోట్ల రూపాయలు బీసీలకు ఖాతాల్లో వేశారు.
రాష్ట్రంలో పేదరికం 12 నుంచి 6 శాతానికి తగ్గింది. ఈ లెక్కలు చెప్తున్నది నీతి అయోగ్. బాబు హయాంలో బీసీలను మోసం చేశారు. జగన్ హయాంలో స్కీం లు, బాబు హయాంలో స్కామ్‌లు. బాబును అరెస్ట్ చేస్తే హైదరాబాద్‌లో గొడవలు ఏమిటి?, బాబు కేజీ పెరిగితే 5 కేజీలు బరువు తగ్గరని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే. సీఎం జగన్ కు వ్యతరేక ఓటు ఎక్కడుంది. చీలనివ్వను అని పవన్ అనడానికి. సీఎం జగన్ పాలనలో జరిగిన మంచిని బస్సు యాత్ర ద్వారా వివరిస్తాం. చంద్రబాబు బాధలో ఉంటే ఎందుకు సినిమా రిలీజ్ చేశారు?, హెరిటేజ్‌ను ఎందుకు మూయలేదు’ అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment