
తిరుమల: నారా లోకేశ్ శృంగారంపై చంద్రబాబునోరు విప్పాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం తిరుమల శ్రీకృష్ణ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ మాధవ్ గురించి చంద్రబాబు, లోకేశ్ రకరకాలుగా మాట్లాడుతున్నారని, ఒక బీసీ ఎంపీపై అలా దారుణంగా మాట్లాడటం మంచిది కాదని చెప్పారు. లోకేశ్ అన్ని రకాల భంగిమలతో విన్యాసాలు చేసినప్పుడు చంద్రబాబు స్పందించారా అని ప్రశ్నించారు. లోకేశ్ శృంగార చర్యలపై చంద్రబాబు మాట్లాడాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఆఫీసులో పని చేసే మహిళలను అసభ్యకరంగా మాట్లాడితే వారు ఏడుచుకుంటూ వెళ్ళిన ఘటనల సంగతేమిటని ప్రశ్నించారు.
ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు ఏపీకి రాజధాని లేకుండా చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పదేళ్లు ఏపీకి హైదరాబాద్‌ను రాజధానిగా ప్రకటిస్తే, చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో పట్టుబడి అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి వచ్చి బస్సులో కాపురం పెట్టారని అన్నారు. పుష్కరాల్లో చంద్రబాబు ఆర్భాటాల కోసం 29 మంది అమాయక భక్తులను చంపేసిన కేసు గురించి ఏనాడైనా ప్రస్తావించారా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను చంద్రబాబు ఎలా దుర్భాషలాడారో, టీడీపీ నేతలు ఆ పార్టీ మహిళా నేత దివ్యవాణిని ఎలా ఇబ్బంది పెట్టారో ఆమే స్వయంగా చెప్పారన్నారు.
నందిగం సురేష్‌ను కొట్టించి అక్రమ కేసులు పెట్టి, ఎన్‌కౌంటర్ చేస్తామని పోలీసులతో టీడీపీ నేతలు బెదిరిస్తే వైఎస్ జగన్ అండగా నిలిచారని, ఇప్పుడు సురేష్ ఎంపీ అయ్యారని మంత్రి గుర్తు చేశారు. గోరంట్ల మాధవ్ మార్ఫింగ్ వీడియో యూకే నుంచి సోషల్ మీడియాలోకి వచ్చిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైందన్నారు. అసలు ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిందే టీడీపీ నాయకులన్నారు. వీడియోపై దర్యాప్తు చేయాలని స్వయంగా ఎంపీయే ఎస్పీని కోరారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment