సాక్షి, తణుకు: ‘దిశ’ కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల గుండెలను శాంతింప చేసిన పోలీసులకు హేట్సాఫ్ తెలిపారు. దేశ ప్రజలంతా నిందితులకు ఉరి వేయాలని కోరుకున్నారన్నారు. కాలయాపన లేకుండా దేవుడే ఎన్‌కౌంటర్ రూపంలో న్యాయం చేయించాడన్నారు. రెండు బెత్తం దెబ్బలు కాకుండా ప్రజలు కోరుకున్న విధంగానే జరిగిందని వ్యాఖ్యానించారు. దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం పట్ల పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హర్షం వ్యక్తం చేశారు.
కర్నూలు: ‘దిశ’ కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం సరైనదేనని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు,ఉద్యోగినులకు తెలంగాణ పోలీసులు భరోసా కల్పించారని తెలిపారు.
విశాఖ: దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో విశాఖపట్నంలో మహిళలు సంబరాలు జరుపుకున్నారు. మద్దిలపాలెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరీ ఆధ్వర్యంలో మహిళలు స్వీట్లు పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment