
చంద్రబాబుకు సేవ చేసేందుకే పవన్ పాలిటిక్స్‌లోకి వచ్చాడు.
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైరయ్యారు. కాగా, మంత్రి కారుమూరి బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘విశాఖ గర్జన విజయవంతమైంది. గర్జన సక్సెస్‌ను ఓర్చుకోలేక జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లు, ఆయుధాలతో దాడికి తెగబడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ పనిచేస్తున్నారు.
దత్తపుత్రుడు అనే పదానికి పవన్ పూర్తి అర్హుడు. యువతకు పవన్ కల్యాణ్ ఏం చేప్తున్నారు?. యువతతో పవన్ రౌడీయిజం చేస్తారా?. ఎంత మంది తోలు తీస్తారు పవన్?. ప్రజలు ఓట్లేసి మమ్మల్ని ఎన్నుకున్నారు. మమ్మల్ని కొడితే ప్రజల్ని కొట్టినట్టే కదా!. పవన్ కల్యాణ్ ముసుగు తొలగిపోయింది. పవన్ దత్తపుత్రుడు అన్నది నిన్నటితో తేలిపోయింది. ముద్రగడను చంద్రబాబు హింసించినా పవన్ నోరు విప్పలేదు. ప్యాకేజీ కోసం పవన్ యువతను పెడదారి పట్టించొద్దు. చంద్రబాబుకు పవన్ కొమ్ముకాస్తున్నారు. కాపుజాతిని అవమానించిన చంద్రబాబును ఎందుకు మోస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.
చంద్రబాబుకు మసాజ్, మాలిష్ చేయడానికి వచ్చావా?..
సాక్షి, విజయవాడ: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు సేవ చేసేందుకే పవన్ పార్టీ పెట్టాడు. పవన్, చంద్రబాబు ముసుగు తొలగింది. చంద్రబాబుకు మసాజ్, మాలిష్ చేయడానికి, కాళ్లు నొక్కడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడు. పవన్ కల్యాణ్ పనికిమాలిన దద్దమ్మ, వెదవ. రాజకీయ నాయకుడిగా ఉండటానికి పవన్‌కు అర్హత లేదు. రౌడీ రాజ్యం తేవాలని పవన్ చూస్తున్నాడు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు వీధి రౌడీలా ఉన్నాయి. పవన్‌కు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా?. పవన్ ఎవరితో కలిసినా అసెంబ్లీ గేటు కూడా తాకలేవు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
నిజజీవితంలోనూ పవన్ చక్కగా నటిస్తున్నారు..
సాక్షి, రాజమండ్రి: బీజేపీ, టీడీపీని ఏకం చేయడమే పవన్ రోడ్‌మ్యాపా అంటూ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. ఎంపీ భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబును కలవడంతో పవన్ ముసుగు తొలగిపోయింది. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ మాట్లాడుతున్నారు. నిజజీవితంలోనూ పవన్ చక్కగా నటిస్తున్నారు. పవన్ పార్టీ ఎందుకోసం పెట్టినట్టు?. చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడు. బాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం.. దీన్నే కదా ప్యాకేజీ అంటారు. పవన్, కేఏ పాల్ ఇద్దరూ చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలే.. వీరిద్దరూ బాబు సూచనలతో నడిచిన వారే. అమరావతి యాత్రతో రాజమండ్రిలో అల్లకల్లోలం సృష్టించారు. రౌడీషీటర్లు, బ్లేడ్ బ్యాచ్‌లను పెంచి పోషిస్తున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.