
సాక్షి, ఏలూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు దళారీ వ్యవస్థను ప్రోత్సహించాడు. చంద్రబాబు పాలనలో పౌరసరఫరాల శాఖలో రూ.20వేల కోట్లు అప్పు చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, మంత్రి కారుమూరి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక పౌర సరఫరా శాఖలో అనేక మార్పులు తెచ్చారు. ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థ లేకుండా చేశారు. 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఈనాడు టిష్యూ పేపర్‌గానే పనికొస్తుంది. చంద్రబాబులాగే ఈనాడు రామోజీ కూడా రూ.వేలాది కోట్లు డైవర్ట్ చేశారు. టీడీపీ హయాంలో వేలాది కోట్లు డైవర్ట్ చేస్తే నోరు మెదపలేదు.
ప్రభుత్వంపై బురద చల్లడానికి ఈనాడు అసత్య కథనాలు రాస్తోంది. చంద్రబాబు దళారీ వ్యవస్థను ప్రోత్సహించాడు. ఒక ఎకరం ఉన్న రైతు వద్ద కూడా మేము ధాన్యం కొనుగోలు చేశాం. దళారీ వ్యవస్థ లేకుండా రైతుల ఖాతాలకి డబ్బు జమ చేశారు. బాబు హయాంలో దళారులు దోచుకున్నారు. ఈనాడు వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలి. మీరు ఎన్ని చేసినా 175కు 175 స్థానాల్లో మా ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో మరో ముందడుగు.. జెండా ఊపి ఈ-ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment