సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడినా రామోజీరావుకు చాలా బాగుంటుంది. కానీ, మేము చేసి ఏ మంచి పనిచేసినా రామోజీకి వినపడదు, కనపడదు. గత ప్రభుత్వం ఏం చేసింది.. మేము ఏం చేస్తున్నది ఒక లిస్టు పెట్టుకుని రామోజీ చూడాలని చురకలు అంటించారు.
కేంద్రం ఓకే చెప్పింది..
కాగా, మంత్రి కారుమూరి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ప్రజలకు కందిపప్పు కూడా ఇవ్వలేదు. ఆ సంగతి రామోజీకి కనపడుదు, వినపడదు. మా ప్రభుత్వంలో కంది పప్పు ధర రూ.150 మార్కెట్‌లో ఉంటే మేము రూ.80కే సబ్సిడీ ఇచ్చాం. నాలుగేళ్లలో మూడు లక్షల టన్నుల కందిపప్పు అందించాం. కేంద్రం పుచ్చిపోయిన కందులు ఇస్తామంటే మేము వద్దన్నాం. దానికి బదులుగా శనగలు ఇస్తామని చెప్పింది. అవి కూడా వద్దని, కంది పప్పు మాత్రమే కావాలని అడిగాం. దానికి కేంద్రం కూడా ఓకే చెప్పింది. త్వరలో అవి రాగానే ప్రజలకు పంపిణీ చేస్తాం.
ఐటీ నోటీసులు రామోజీకి కనిపించవా?
ఇలా అసలు సంగతి రాయకుండా రామోజీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ఏం మాట్లాడినా రామోజీకి చాలా బాగుంటుంది. కానీ, మేము ఏం చేసినా రామోజీకి కనిపించదు. చంద్రబాబు పాలనలో ఇసుక దోచుకున్నారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దోచేసినప్పుడు రామోజీకి ఎందుకు కనపడలేదు. వనజాక్షి ఇసుక రావాణ అడ్డుకుంటే ఆమెకు దారుణంగా కొట్టారు. పైగా చింతమనేనితో రాజీ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేశారు. మా ప్రభుత్వం పారదర్శకంగా అందరికీ ఒకే రేటుతో ఇసుక అందిస్తోంది. రామోజీ చేసిన అక్రమాల గురించి ఆయన తోడల్లుడే వివరించారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు వస్తే ఎందుకు నోరు విప్పలేదు?. నీతి, నిజాయితీ అని చెప్పే చంద్రబాబు రూ.118కోట్లు దోచేసినట్టు ఐటీ శాఖ తేల్చింది. దీనిపై చంద్రబాబు, లోకేశ్ ఎందుకు మాట్లాడటం లేదు?. ప్రతీ కేసులో స్టే తెచ్చుకుని బ్రతకడం చంద్రబాబు పని. ఆయన వ్యవహారం ఢిల్లీ పెద్దలకు తెలుసు కాబట్టే వారు దరిచేరనీయడం లేదు.
చంద్రబాబు అంతటి నయవంచకుడు, దుర్మార్గుడు మరెవరూ లేరు. ఈ మాట ఎన్టీఆర్ అనేకసార్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పేదలు కూడా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. చంద్రబాబు ఎవరో ఒకరి సపోర్టుతో ఎన్నికలకు వెళ్లడం తప్ప సొంతంగా వెళ్లలేరు అని ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: జమీలి ఎన్నికలపై సీఎం జగన్‌దే తుది నిర్ణయం: మంత్రి అమర్నాథ్
Comments
Please login to add a commentAdd a comment