సాక్షి, ఏలూరు: తమ సొమ్ము దోచుకున్నాడు కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని ప్రజలు అనుకుంటున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. చంద్రబాబు నీతిమంతుడు, ఎవరి సొమ్ము తినలేదని దుర్గమ్మదగ్గర భువనేశ్వరి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు మంత్రి కారుమూరి అసలు 2 ఎకరాల నుంచి లక్షల కోట్లు చంద్రబాబుకు ఎలా వచ్చాయ్ అని ప్రశ్నించారు.
సైకిల్ ఎక్కి సవారికి అద్దె కొడుకును తెచ్చుకున్నారు
మామ ఎన్టీఆర్ నుంచి పార్టీని లాగేసుకున్న చంద్రబాబు సైకిల్ ఎక్కాడని, ఇప్పుడు దానిపై సవారీకి అద్దె కొడుకును తెచ్చుకున్నాడని ఎంపీ కోటగరి శ్రీధర్ మండిపడ్డారు. ఏపీలో పేదల ఆత్మగౌరవం నిలబెట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీనని, రాష్ట్రంలో పేదవారు, బలహీన వర్గాల వారు ఉండకూడదంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో 30 ఏళ్లు సీఎంగా ఉండాలన్నారు.
ఎన్ని జాకీలు పెట్టి లేపినా లోకేష్ పైకి లేవడు
చంద్రబాబుకు సొంత కొడుకు పని చేయడం లేదని ఎద్దేవా చేశారు ఎంపీ భరత్. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్న ఎంపీ భరత్.. లోకేష్‌ను ఎన్ని జాకీలు పెట్టి లేపినా పైకి లేవడన్నారు. పవన్.. నేడు, రేపు మాట్లాడే మాటలకు పొంతన ఉండదన్నారు ఎంపీ భరత్. బాబు పింఛన్ రూ. 5 వేలు ఇస్తానంటాడు.. అది ఇచ్చేది వారి కార్యకర్తలకేనని విమర్శించారు. ఏపీలో మరో 30 ఏళ్లు వైఎస్‌జగనే సీఎం అని స్పష్టం చేశారు భరత్. వై నాట్ 175 నినాదం సీఎం జగన్ ఆత్మవిశ్వాసానికి నిదర్శమన్నారు.
దేశంలో ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయి
దేశంలో ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయన్నారు మంత్రి విశ్వరూప్. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఏపీలాగే పింఛన్ పెంచుకుంటూ పోతామనే విషయమే ఇందుకు నిదర్శనమన్నారు. 6 నెల్లలోనే లక్షా 40 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌దన్నారు మంత్రి విశ్వరూప్. పేదలకు పింఛన్ పెంచలేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment